Upasana On Game Changer :గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ 'గేమ్‌ఛేంజర్' సినిమాతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. సినిమాలో రామ్‌చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో హీరో రాణ్చరణ్ అండ్ మూవీటీమ్‌కు పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కూడా ఓ పోస్ట్ షేర్ చేశారు.
'గేమ్ ఛేంజర్' మూవీ రివ్యూలపై ఉపాసన స్పందించారు. తన భర్త చెర్రీకి కాంగ్రాంట్స్ చెప్పారు. 'కంగ్రాట్స్ డియర్ హస్బెండ్. ప్రతి విషయంలో మీరు నిజంగానే గేమ్ ఛేంజర్. లవ్ యూ' అని పోస్ట్ చేశారు. ఇక మెగా ఫ్యాన్స్‌కు కూడా రామ్‌చరణ్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నిర్మాత దిల్‌రాజు, దర్శకధీరుడు రాజమౌళి, పలువురు సినీ ప్రముఖులు తొలి రోజే థియేటర్లలో రామ్‌చరణ్ పెర్ఫార్మెన్స్ థియేటర్లలో చూశారు.
ఫ్యాన్స్‌కు నిరాశ
ఇక సినిమాలో ఎంతో క్రేజ్ వచ్చిన 'నానా హైరానా' పాటను తొలగించినట్లు మేకర్స్ తెలిపారు. తొలి రెండు రోజులు ఈ సాంగ్ సినిమాలో ఉండదని చెప్పారు. 'అందరికీ ఎంతో ఇష్టమైన 'నానా హైరానా' సాంగ్‌ను ఇన్‌ఫ్రారెడ్ ఇమేజ్‌ల ప్రాసెసింగ్‌తో తెరకెక్కించాం. అయితే కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ కారణంగా ప్రస్తుతం దీన్ని థియేటర్లలో వేయలేకపోయాం. త్వరలోనే ఈ సమస్యను క్లియర్ చేస్తాం. జనవరి 14 నుంచి ఈ పాటను సినిమాలో యాడ్ చేస్తాం. అందుకోసం మా టీమ్ అంతా రాత్రి, పగలు కష్టపడి పనిచేస్తోంది' అని పోస్ట్ షేర్ చేసింది.