Ram Charan Upasana Viral Video :టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్స్‌లో రామ్‌చరణ్ ఉపాసన ఒకరు. ఈ జంట ఎక్కడకి వెళ్లిన తమ కపుల్ గోల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. చరణ్ తనను ఎంతబాగా చూసుకుంటున్నారో అంటూ ఉపాసన కూడా సోషల్ మీడియాలో తమ క్యూట్ మూమెంట్స్ షేర్ చేస్తుంటారు. ఇక చెర్రీ కూడా అంతే తమ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. అయితే తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ 'చెర్రీ సో కేరింగ్', 'ఉప్సీని ఎంత బాగా చూసుకుంటున్నారో' అంటూ నెటిజన్లు చెర్రీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇటీవలే అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకకు దేశంలోని సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖలందరికీ ఆహ్వానాలు అందాయి. అందులో భాగంగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా ఈ వేడుకల కోసం జామ్‌నగర్‌కు పయనమయ్యారు. అయితే ఫ్లైట్‌లో ఉప్సీ అలసటగా నిద్రిస్తున్న సమయంలో చెర్రీ ఆమె కాళ్లు పట్టుకుని నెమ్మదిగా నొక్కుతూ కనిపించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వగా, ఫ్యాన్స్ ఈ క్యూట్ కపుల్ గురించి స్వీట్‌గా కామెంట్స్ చేస్తున్నారు.