Ram Charan Rajamouli Documentary :టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినీ, పర్సనల్ జర్నీ ఆధారంగా తెరకెక్కిన 'మోడ్రన్ మాస్టర్స్' డాక్యూమెంటరీపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే దీనిపై పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తుండగా, తాజాగా హీరో రామ్ చరణ్ ఈ డాక్యుమెంటరీను కొనియాడుతూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
" రాజమౌళికి సినిమాలపై, స్టోరీలపై ఉన్న డెడికేషన్ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుంది. ఈ 'మోడ్రన్ మాస్టర్స్' డాక్యుమెంటరీ ఆయన ఉజ్వల కెరీర్‌కు మనమిచ్చే సరైన గౌరవం అని నేను భావిస్తున్నాను" అంటూ చెర్రీ రాసుకొచ్చారు.
ఇదిలా ఉండగా, ఈ డాక్యుమెంటరీలోనూ రాజమౌళి గురించి చెర్రీ మాట్లాడారు. ఆయనతో పాటు 'మగధీర', 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలకు కలిసి పని చేయడం గురించి, అలాగే తన అనుభవాలను పంచుకున్నారు. సినిమాలంటే రాజమౌళికి ఎంతో గౌరవమని పేర్కొన్నారు.
ఇక ఈ డాక్యూమెంటరీ విషయానికి వస్తే, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్ వేదికగా విడుదలైన ఈ సిరీస్‌ను రాఘవ్ ఖన్నా డైరెక్ట్ చేశారు. ఆగస్టు 2నుంచి ఇది ప్రేక్షకుల కోసం అందుబాటులోకి వచ్చింది. ఇందులో టాలీవుడ్‌తో పాటు పలువురు హాలీవుడ్ డైరెక్టర్లు, సెలబ్రిటీలు కూడా రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపించారు. వారు కూడా జక్కన్నతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
రాజమౌళి డాక్యుమెంటరీ హైలైట్స్ ఇవే
తెలుగు సినిమా స్థాయి పెంచిన దర్శకుడి గురించి తెలుసుకోవాలని అందరికీ ఆతృతగానే ఉంటుంది. అందుకే ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అయినప్పటినుంచి ట్రెండింగ్‌లో ఉంది. నిజానికి ఇందులో కొన్ని విషయాలు ప్రేక్షకులకు తెలిసినవే, అయినా మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. రాజమౌళి ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. వాటన్నింటి మధ్య రాజమౌళి ఎలా ఎదిగారో కూడా వివరించారు. నిజానికి తన వ్యక్తిగత జీవితాన్ని అభిమానులతో షేర్ చేసుకోవడానికి రాజమౌళి తీసుకున్న నిర్ణయం చలనచిత్ర పరిశ్రమలో ఒక కొత్త పద్ధతి. చాలామంది నటులు, దర్శకులు తమ వ్యక్తిగత జీవితాలను ఎవరితోనూ పంచుకోవటానికి ఇష్టపడరు. ఈ విధంగా వ్యక్తిగత జీవితం గురించి ఒక డాక్యుమెంటరీ రూపొందించటం రాజమౌళికే చెల్లింది.
బాలనటుడిగా రాజమౌళి నటించిన సినిమా ఏంటో తెలుసా? - జక్కన్న డాక్యుమెంటరీ రివ్యూ - SS Rajamouli Documentary Review
రాజమౌళి లాంటి పిచ్చోడిని చూడలేదు! : ప్రభాస్ - Netflix Rajamouli Documentary