Rakul preet singh First Remuneration :రకుల్ ప్రీత్ సింగ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ నాజూకు అందం కన్నడ సినిమా గిల్లితో 2009లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన గ్లామర్, యాక్టింగ్‌తో తమిళ, తెలుగు, హిందీ భాషల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. టాలీవుడ్‌లో కెరటం చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకుంది. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ వంటి హిట్ చిత్రాల్లో పలువురు స్టార్ హీరోల సరసన నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ పొజిషన్‌కు చేరుకుంది. అలా మొత్తానికి మోడలింగ్ నుంచి ఇండియా వైడ్‌గా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకునే స్థాయికి ఎదిగింది. సినిమాకు రూ.3 కోట్లకు పైగా తీసుకుంటుందని.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తన సినీ ప్రారంభ రోజుల్ని, మోడలింగ్ కెరీర్‌ను గుర్తు చేసుకుంది. "నేను షూటింగ్‌లను మొదలు పెట్టినప్పటి నుంచి నాకు 25 ఏళ్లు వచ్చేవరకు మా అమ్మే ఎప్పుడూ తోడుగా ఉండేది. నా మోడలింగ్ తొలి షూటింగ్ సంపాదన రూ. 5 వేలు. అక్కడి నుంచి ఈ స్థాయి దాకా వచ్చానంటే నా పేరెంట్స్, సన్నిహితులు ఇచ్చిన మద్దతు వల్లే. వారి వల్లే ఇదంతా సాధ్యమైంది. వాళ్లు లేకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కొనేదానిని" అంటూ చెప్పింది.