తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ట్రెండీగా రకుల్‌ పెళ్లి కార్డు - ఆ హ్యాష్​ట్యాగ్​కు అర్థం ఏంటంటే ? - రకుల్ ప్రీత్ సింగ్ వివాహం

Rakul Jacky Wedding Card : బాలీవుడ్ స్టార్ కపుల్ రకుల్​ ప్రీత్ సింగ్​- జాకీ భగ్నానీ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంట వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలు మీ కోసం

Rakul Jacky Wedding Card
Rakul Jacky Wedding Card

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 5:53 PM IST

Rakul Jacky Wedding Card :బీటౌన్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. తన చిరకాల ప్రియుడు బాలీవుడ్ స్టార్ జాకీ భగ్నానీతో ఫిబ్రవరి 21న ఆమె వివాహం గ్రాండ్​గా జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. గోవా వేదికగా జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్​లో కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారట.

అయితే తాజాగా ఈ జంట వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్​ అవుతోంది. అట్రాక్టివ్ కలర్స్​తో సింపుల్​గా ఉన్న ఆ కార్డులో పెళ్లి ముహూర్తం రాసుంది. కవర్​పై ఓ వైపు రకుల్​ అండ్​ జాకీ అని రాసుండగా, మరోవైపు అబ్​ దోనో భాగ్​నా - నీ ( ఇక ఇద్దరు ఎక్కడికి పరిగెట్టద్దు అని అర్థం, దీంతో పాటు జాకీ భాగ్​నానీ సర్​ నేమ్​ను కూడా ఇందులో మెన్షన్ అయ్యింది) అనే హ్యాష్​ ట్యాగ్​ను ప్రింట్​ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ వీళ్ల క్రియేటివిటీకి హ్యాట్సాఫ్​ చెప్తున్నారు. హ్యాష్​ట్యాగ్ చాలా కొత్తగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

మూడు రోజుల పెళ్లి - ముగ్గురు డిజైనర్లు
Rakul Jacky Wedding Designers : మరోవైపు ఈ జంట పెళ్లి దుస్తుల డిజైనర్లను కూడా లాక్‌ చేశారు. మూడు రోజుల పాటు సాగే ఈ వివాహ వేడుక కోసం రోజుకో డిజైనర్ తయారుచేసిన దుస్తుల్ని ఈ ఇద్దరూ వేసుకోనున్నారట. మనీశ్​ మల్హోత్రా, తరుణ్ తహిల్యానీ, సబ్యసాచి లాంటి స్టార్ డిజైనర్స్ ఈ​ పెళ్లి దుస్తులను రెడీ చేయనున్నారట.

Rakul Jacky Wedding Venue :తొలుత రకుల్​- జాకీ తమ వివాహాన్ని మిడిల్‌ ఈస్ట్‌లో ప్లాన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పలు ప్రదేశాలను కూడా సెలక్ట్‌ చేశారు. అయితే, గత డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తమ ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలని ఈ ఇద్దరూ నిర్ణయించుకున్నారట. అలా చివరి నిమిషంలో పెళ్లి వేదికను మార్చారని సమాచారం.

వెడ్డింగ్ డెస్టినేషన్​లో మార్పులు - ఆయన కోసమే రకుల్, జాకీ నిర్ణయం!

పెళ్లిపీటలెక్కబోతున్న రకుల్​ప్రీత్ సింగ్​!- వరుడెవరో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details