తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పెళ్లి పీటలపై రకుల్- జాకీ జంట - చూడముచ్చటగా ఫొటోలు - Rakul Jackky Wedding Photos

Rakul Jackky Marriage Photos : బాలీవుడ్ స్టార్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్​, జాకీ భగ్నానీ పెళ్లి వేడుకలు గ్రాండ్​గా జరిగాయి. తాజాగా ఈ జంట తమ పెళ్లి ఫొటోలను నెట్టింట షేర్ చేశారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 9:56 PM IST

Updated : Feb 21, 2024, 10:13 PM IST

Rakul Jackky Marriage Photos :బాలీవుడ్ స్టార్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్​, జాకీ భగ్నానీ ఎట్టకేలను ఒకటయ్యారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట నేడు (ఫిబ్రవరీ 21న) రెండు సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. గోవాలోని ఓ స్టార్ హోటల్​లో పంజాబీ అలాగే సింధి పద్దతిలో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను ఈ స్టార్ కపుల్​ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీటిని చూసిన ఫ్యాన్స్ కొత్త జంటకు విషెస్ చెప్తున్నారు.

సంగీత్​లో బాలీవుడ్ కపుల్స్ డ్యాన్స్​
Rakul Jacky Prewedding Celebrations : ఇప్పటికే వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా చాలా గ్రాండ్​గా జరిగాయి. పెళ్లికి వచ్చిన అతిథులు తాజాగా జరిగిన సంగీత్​లో సందడి చేశారు. బాలీవుడ్​ కపుల్స్​ వరుణ్‌ ధావన్‌ నటాషా, శిల్పాశెట్టి- రాజ్‌ కుంద్రా ఇలా పలువురు స్టార్స్​ సంగీత్‌లో పాల్గొని స్టెప్పులేశారు. ఇక హల్దీ, మెహందీ వేడుకలు కూడా బాగా జరిగాయి. గతంలో ఈ జంట తమ ఫ్రెండ్స్​కు గ్రాండ్ బ్యాచిలరేట్ పార్టీ కూడా ఇచ్చారు. దీంతో పాటు ఈ జంట వెడ్డింగ్ కార్డ్​ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. అబ్​ దోనో భాగ్​నా - నీ ( ఇక ఇద్దరు ఎక్కడికి పరిగెట్టద్దు అని అర్థం, దీంతో పాటు జాకీ భాగ్​నానీ సర్​ నేమ్​ను కూడా ఇందులో మెన్షన్ అయ్యింది) అనే హ్యాష్​ ట్యాగ్​ను ప్రింట్​ చేశారు. సరికొత్తగా ఉన్న ఈ హ్యాష్​ట్యాగ్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

Rakul Preet Singh Career : ఇక రకుల్ కెరీర్ విషయానికి వస్తే - 'గిల్లీ' అనే కన్నడ చిత్రంతో సినీ తెరంగేట్రం చేసింది రకుల్. 2013లో వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ సక్సెస్​తో నటిగా మంచి మార్కులు కొట్టేసిన రకుల్​, ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌, కోలీవుడ్‌లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె కీలక పాత్ర పోషించిన 'ఇండియన్‌ 2' (భారతీయుడు 2) విడుదలకు సిద్ధమవుతోంది.

రెండు సంప్రదాయాల వివాహం - ఒక్కటైన రకుల్, జాకీ జంట

లగ్జరీ హోటల్‌లో రకుల్ పెళ్లి - అక్కడ ఒక్క రూమ్ ధర ఎంతంటే ?

Last Updated : Feb 21, 2024, 10:13 PM IST

ABOUT THE AUTHOR

...view details