తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సంచలనం సృష్టించిన 'స్త్రీ 2' బంపర్ ఆఫర్‌ - ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ - Stree 2 Free Ticket Offer - STREE 2 FREE TICKET OFFER

Shraddha Kapoor Stree 2 Free Tickets Offer : రీసెంట్‌ బాలీవుడ్‌ హిట్ మూవీ 'స్త్రీ 2' మూవీ టీమ్‌ సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒక టికెట్‌ కొంటే మరొకటి ఉచితంగా పొందొచ్చని అనౌన్స్‌ చేసింది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ANI and Getty Images
Stree 2 SHRADDHA KAPOOR (source ANI and Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 9:29 PM IST

Updated : Sep 12, 2024, 9:42 PM IST

Shraddha KapoorStree 2 Free Tickets Offer :రీసెంట్‌ బాలీవుడ్‌ హిట్ మూవీ 'స్త్రీ 2' చిత్ర బృందం సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒక టికెట్‌ కొంటే మరొకటి ఉచితంగా పొందొచ్చని అనౌన్స్‌ చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ఈ బంపర్‌ ఆఫర్‌ పొందాలంటే బుక్‌ మై షో యాప్‌లో STREE 2 ప్రోమో కోడ్‌ ఉపయోగించాలని తెలిపింది. సెప్టెంబరు 13న మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొంది.

గతంలో బాలీవుడ్ బాక్సాఫీస్ ముందు హిట్ అందుకున్న స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చింది స్త్రీ 2. సినిమాలో హీరో రాజ్‌కుమార్‌ రావ్‌, సాహో బ్యూటీ, హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు అమర్‌ కౌశిక్‌ హారర్‌ కామెడీ మూవీగా దీన్ని తెరకెక్కించారు. వరుణ్‌ ధావన్‌, తమన్నా, అక్షయ్‌ కుమార్‌ గెస్ట్ రోల్స్‌లో కనిపించి సందడి చేశారు. ముఖ్యంగా తమన్నా చేసిన ఆజ్ కీ రాత్‌ స్పెషల్ సాంగ్ బాగా హైలైట్‌గా నిలిచింది. శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుని సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

Stree 2 Movie Collections :ఆగస్టు 15న ఈ చిత్రం బాలీవుడ్‌ బాక్సాఫీసు ముందు కొచ్చింది. అదే రోజు విడుదలైన పలువురు స్టార్‌ హీరోల చిత్రాలు 'వేదా' (జాన్‌ అబ్రహం), ఖేల్‌ ఖేల్‌ మే (అక్షయ్‌కుమార్‌)కు గట్టి పోటీ ఇచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ తెచ్చుకుని రికార్డులు సృష్టించింది. మూవీ మేకింగ్‌పై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించగా, స్త్రీ చిత్రంలాగానే స్త్రీ 2 కూడా మంచి ఫన్‌ అందించిందని మూవీ లవర్స్‌ రివ్యూలు ఇచ్చారు.

వసూళ్ల వివరాల విషయానికొస్తే, మొదటి రోజే రూ.54కోట్లు అందుకుంది. ఇప్పటి వరకూ రూ. 780 కోట్లకు(గ్రాస్‌)పైగా కలెక్షన్స్‌ వసూళ్లు చేసి బాక్సాఫీస్‌ ముందు అదరగొట్టింది. శ్రద్ధా కపూర్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన రెండో ఇండియన్ సినిమాగానూ నిలిచింది. అలానే అత్యధిక వసూళ్లను అందుకున్న 11వ భారతీయ సినిమాగానూ ఘనత సాధించింది.

స్టార్ హీరో లైనప్​లో ఏకంగా 9 సినిమాలు - రూ.650 కోట్ల బడ్జెట్​తో! - Big Budget Upcoming Movies

చిన్న సినిమాలతో కొత్త శుక్రవారం - ఏఏ చిత్రాలు థియేటర్లలో వస్తున్నాయంటే? - This weak Theatre Relases

Last Updated : Sep 12, 2024, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details