తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆ సినిమా అస్సలు రజనీ స్టైల్​ కాదు - డైరెక్టర్​ స్టోరీని అందుకే అలా రాశారు' - Rajinikanth Vettaiyan Movie - RAJINIKANTH VETTAIYAN MOVIE

Rajinikanth Vettaiyan Movie : 'వేట్టయాన్' సినిమా అస్సలు రజనీ స్టైల్​లో ఉండదంటూ టాలీవుడ్ స్టార్ హీరో రానా ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మరీ ఈ చిత్రం ఎలా ఉండనుందో కూడా ఆయన తెలిపారు. ఆ వివరాలు మీ కోసం.

Rajinikanth Vettaiyan Movie
Rajinikanth And Rana (Source : ETV Bharat Archives)

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 12:19 PM IST

Rajinikanth Vettaiyan Movie :టాలీవుడ్ స్టార్ హీరో రానా ప్రస్తుతం రజనీకాంత్​తో కలిసి 'వేట్టయాన్‌' అనే సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలె హీరో అమితాబ్ బచ్చన్ కూడా చిత్రీకరణలో పాల్గొని సందడి చేశారు. అయితే ఈ సినిమా గురించా రానా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేశారు. ఇది రజనీకాంత్‌ స్టైల్‌లో సాగే సినిమా కాదని, స్టోరీ మొత్తం చాలా డిఫరెంట్​గా ఉంటుందని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'వేట్టయాన్' గురించి మరిన్ని విశేషాలు పంచుకున్నారు.

"రజనీకాంత్​తో కలిసి నటించాలని నేను ఎప్పుటి నుంచి అనుకునేవాణ్ని. 'వేట్టయాన్‌'తో ఆ కల నెరవేరింది. టి.జె. జ్ఞానవేల్‌ ఈ సినిమా స్టోరీ చెప్పగానే నేను చాలా ఇంప్రెస్‌ అయ్యాను. జ్యుడిషియల్‌, పోలీసు వ్యవస్థ తదితర అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎంతో రీసెర్చ్​ చేసి జ్ఞానవేల్​ ఈ స్టోరీ రాశారు. రజనీ స్టైల్‌ సినిమా కాదు ఇది. ఆయన తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన్న చిత్రాన్ని ఎంపిక చేసుకున్నందుకు, అందులో నేను భాగమైనందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అమితాబ్‌ బచ్చన్‌, ఫహద్‌ ఫాజిల్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అక్టోబర్​లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు." అని రానా అన్నారు.

మరోవైపు ఇదే వేదికగా 'కల్కి2898 AD' సినిమా గురించి రానా మాట్లాడారు. తాను ఈ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు.

"నాగ్‌ అశ్విన్‌తో నాకు ఎప్పటి నుంచో మంచి పరిచయం ఉంది. 'కల్కి' సినిమాకు అందరూ బాగా కనెక్ట్‌ అవుతారు. హాలీవుడ్​ సినిమా'అవెంజర్స్‌' రేంజ్‌లో ఉంటుంది ఈ స్టోరీ. ఓ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో నేను పాల్గొనడం వల్ల ఈ సినిమాలో భాగమని అనుకున్నారు. కానీ, నేను ఇందులో నటించలేదు" అని తెలిపారు.

ఇదిలా ఉండగా, స్టార్ డైరెక్టర్ రాజమౌళి సకెస్స్​ సీక్రెట్​ను రివీల్ చేశారు రానా. ఓ అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఆయన పడే కష్టం గురించి తెలిపారు. దీంతో పాటు వారిద్దరి మధ్య ఉన్న అనుభవాన్ని పంచుకున్నారు.

"నేను రాజమౌళితో కలిసి ఆరేళ్లు జర్నీ చేశాను. మార్కెట్‌ ఎలా ఉంది? రెమ్యూనరేషన్ ఎంత? అనే విషయాలను ఆయన అస్సలు పట్టించుకోరు. ఓ అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు అందించాలని అనుకుంటారు. దాని కోసం రెండేళ్లైనా, పదేళ్లైనా కష్టపడతారు." అని జక్కన్నను ప్రశంసలతో ముంచెత్తారు.

అప్​డేట్స్ ఊసే ఎత్తని యంగ్​ హీరోలు - ఇంకెప్పుడు చెప్తారో ?

'రాక్షస రాజు'గా రానా - 'నా సామిరంగా'లో అంజిగాడిగా అల్లరి నరేశ్​

ABOUT THE AUTHOR

...view details