తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ స్టార్​ హీరోతో సినిమా చేసేందుకు నో చెప్పిన రాజమౌళి! - ఎందుకంటే? - Rajamouli Salman Khan

ఇప్పటికే ఎంతో మంది హీరోలతో సినిమాలు చేసి భారీ సక్సెస్​లను అందుకున్న దర్శకధీరుడు రాజమౌళి ఓ స్టార్ హీరోతో మాత్రం సినిమా చేయనని చెప్పారట. ఇంతకీ ఆయన ఎవరు? అసలు జక్కన్న ఎందుకు చేయనని చెప్పారో తెలుసుకుందాం.

Etv ఆ స్టార్​ హీరోతో సినిమా చేసేందుకు నో చెప్పిన రాజమౌళి! - ఎందుకంటే?
ఆ స్టార్​ హీరోతో సినిమా చేసేందుకు నో చెప్పిన రాజమౌళి! - ఎందుకంటే?

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 4:45 PM IST

Rajamouli Salman Khan : దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడీ పేరు తెలియని వారు బహుశ ఉండరేమో. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అప్పటివరకు టాలీవుడ్​ వరకే పరిమితమైన తన క్రేజ్​ను, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని బహుబలి, ఆర్​ఆర్​ఆర్​లతో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. హాలీవుడ్ డైరెక్టర్స్​, యాక్టర్స్​ సైతం ఆయన టేకింగ్​కు ఫిదా అయిపోయారు.

ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాను అయితే ఏకంగా ఆస్కార్ వేదికపైకి తీసుకెళ్లి నిలబెట్టిన ఘనత ఆయనది. మరి ఇంతటి ఘనత సాధించిన స్టార్ డైరెక్టర్​తో ఒక్క సినిమా అయినా చేయాలని హీరోలందరూ ఆశపడుతుండారు. అయితే జక్కన్న మాత్రం ఓ స్టార్ హీరోతో వర్క్ చేయలేనని నో చెప్పారట. ఆ హీరో కూడా చిన్న కథానాయకుడేమీ కాదు. బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు వసూళ్లు చేసిన భాయ్. ఆయనే కండల వీరుడు సల్మాన్ ఖాన్.

అవును మీరు చదువుతుంది నిజమే! సల్మాన్ ఖాన్​తో సినిమా చేసేందుకు జక్కన్న నో చెప్పారని బయట కథనాలు ఉన్నాయి. అయితే ఇంతకీ రాజమౌళి సినిమాలకు ఆయన తండ్రి, రైటర్​ విజయేంద్ర ప్రసాదే కథలను అందిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అలానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కోసం కూడా ఓ కథను సిద్ధం చేశారు. ఆ సినిమానే భజరంగి భాయ్ జాన్. సల్మాన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్​గా నిలిచింది. పాకిస్థాన్ నుంచి తప్పిపోయి ఇండియాకు వచ్చిన ఓ చిన్నారిని తిరిగి ఆ దేశానికి పంపించేందుకు ఓ సామాన్యుడు ఎలా కష్టపడ్డాడు. చివరకు ఆ పాపను పాకిస్థాన్​కు చేర్చాడా లేదా అన్నదే ఈ చిత్ర కథాంశం.

2015లో రిలీజైన ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్ధికి, హర్షాలీ మల్హోత్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్రం జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా అని తెలిసింది. కానీ విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రాజమౌళికి చెప్పిన సందర్భంలో ఆయన బాహుబలి రెండో క్లైమాక్స్ తెరకెక్కించే పనిలో ఫుల్​ బిజీగా ఉన్నారట. అందుకే ఆ సినిమాను చేయలేనని చెప్పారట. దీంతో భజరంగీ భాయ్​ జాన్​ను కబీర్ ఖాన్ డెరెక్షన్ చేశారు. అలా రాజమౌళి సల్మాన్ చిత్రానికి నో చెప్పారని బయట కథనాలు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం జక్కన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

పవన్​కల్యాణ్​తో రాజమౌళి సినిమా - హింట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్​!

తెలుగులో రానున్న 'ప్రేమలు' - ఈ వారం థియేటర్లలో ఏయే సినిమాలు సందడి చేయనున్నాయంటే ?

ABOUT THE AUTHOR

...view details