Rajamouli Gaami Movie :మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం 'గామి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొత్త డైరెక్టర్ విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 8న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచేసింది. ఆద్యంతం ఎంతగానో ఆకట్టుకున్న ఆ గ్లింప్స్ వీడియోపై ఎంతో మంది ప్రముఖులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
తాజాగా ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి కూడా ఈ ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. "కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు కూడా సాకారమవుతాయి. 'గామి' గురించి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట నాకు గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంతగా కష్టపడ్డారో నాకు అర్థమైంది" అంటూ మూవీ టీమ్‌కు విషెస్ తెలిపారు.
Gaami Movie Cast : ఇక 'గామి'లో విశ్వక్సేన్ డిఫరెంట్ గెటప్‌లో కనిపించారు. దీంట్లో శంకర్ అనే అఘోరాగా కనిపిస్తారు. అంతే కాకుండా ఇందులో మానవ స్పర్శను తట్టుకోలేని ఓ మనిషిలా కనిపించనున్నారంటూ మేకర్స్ ఇటీవలే వెల్లడించారు. దీంతో పాటు ఈ చిత్రంలో విశ్వక్‌కు మరో రెండు భిన్నమైన గెటప్‌లు ఉంటాయని సమచారం.