Rajamouli Dance Practise :స్టార్ డైరెక్టర్ రాజమౌళిని అందరూ జక్కన్న అని ఊరికే పిలవరు. సినిమాలను తెరకెక్కించే విషయంలో నుంచి ఆయన చేసే అన్ని పనుల్లోనూ ఆయన ఎంతో పెర్ఫెక్షన్ చూపిస్తారు. అందుకే ఆయనకు ఆ ముద్దు పేరు వచ్చింది. వర్క్‌తో పాటు ఫ్యామిలీ లైఫ్‌ను ఆయన చక్కగా బ్యాలెన్స్ చేస్తుంటుంటారు. షూటింగ్స్ సమయంలో స్ట్రిక్ట్‌గా కనిపంచే ఆయన ఆఫ్‌స్క్రీన్‌లో ఎంతో సరదాగా కనిపిస్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు.
తాజాగా ఆయన తన ఫ్యామిలీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ ఈవెంట్లో తన సతీమణి రమతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. అందులో ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అది చూసిన ఫ్యాన్స్ ' ఇన్నేళ్లు జక్కన్న ఈ ట్యాలెంట్‌ను ఎక్కడ దాచుంచారు' అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ వీడియో అంత క్లారిటీగా ఉండనప్పటికీ అది సోషల్ మీడియోలో తెగ ట్రెండ్ అయ్యింది. అయితే తాజాగా దీనికి సంబంధించిన రిహార్సల్స్ వీడియో ఒకటి నెట్టిట సందడి చేస్తోంది.
అందులోరాజమౌళి-రమ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. అందమైన ప్రేమరాణి చేయి తగిలితే అంటూ తన సతీమణి చేయి పట్టుకుని ఎంతో గ్రేస్‌తో డ్యాన్స్ వేశారు. ఈ వీడియో కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఆయన పెర్ఫెక్ట్గా స్టెప్పులేసిన తీరు చూసి చేసే పని ఏదైనా రాజమౌళి సిన్సియర్‌గా సక్సెస్‌ఫుల్‌గా చేస్తారంటూ కితాబులిస్తున్నారు. అంతే కాకుండా జక్కన్నలో ఈ యాంగిల్ ఎంతో క్యూట్‌గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.