తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రాజాసాబ్' న్యూ పోస్టర్- డార్లింగ్ శ్వాగ్ లుక్ అదిరిపోయిందిగా - RAJA SAAB UPDATE

ప్రభాస్ రాజాసాబ్ అప్డేట్- ఫ్యాన్స్​కు ట్రీట్ ఇచ్చిన మేకర్స్​- కొత్త పోస్టర్​లో డార్లింగ్ లుక్ అదుర్స్

Raja Saab Movie Update
Raja Saab Movie Update (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2024, 4:09 PM IST

Raja Saab Movie Update :పాన్ఇండియా స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'ది రాజా సాబ్'. కామెడీ, హర్రర్ థ్రిల్లర్ జానర్​లో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్​ డే సందర్భంగా మేకర్స్​ రెండు రోజుల ముందే ఫ్యాన్స్​కు ట్రీట్ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం సినిమా నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. ప్రభాస్ స్టైలిష్ లుక్​తో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక అక్టోబర్ 23న అసలైన ట్రీట్ ఉందంటూ పోస్ట్ షేర్ చేశారు. అంటే ప్రభాస్ బర్త్​ డే రోజు వీడియో గ్లింప్స్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

పోస్టర్​లో డార్లింగ్ లుక్ చాలా స్టైలిష్​గా ఉంది. చాలా కాలం తర్వాత వింటేజ్ ప్రభాస్​ను గుర్తు చేసేలా ఉంది. టీ షర్ట్​, షర్ట్​, బ్లాక్ జీన్స్​తో ప్రభాస్ నిలబడి ఉన్న పోస్టర్ ఫ్యాన్స్​ను తెగ ఆకట్టుకుంటుంది. ఇంక కూలింగ్ గ్లాసెస్ ధరించడం వల్ల మరింత స్టైలిష్ లుక్ వచ్చింది. ఈ పోస్టర్​ను డైరెక్టర్ మారుతి చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాశారు. 'ఈ ప్రయాణంలో మేం, తయారు చేసిన డార్లింగ్ క్యారెక్టర్ ఇది' అని మారుతి పోస్ట్​ చేశారు. నిమిషాల్లోనే ప్రభాస్ లుక్ ట్రెండింగ్​లోకి వచ్చేసింది. ఇక నుంచి సినిమా రిలీజ్ దాకా వరుసగా అప్డేట్స్ ఉంటాయని నిర్మాత ఎస్​కేఎన్​ తెలిపారు.

ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. తెలుగుసహా హిందీ, తమిళం, మళయాలం, కన్నడ భాషల్లో పాన్ఇండియా లెవెల్​లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా, ఈ సినిమా 2025 వేసవి సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది.

దీంతోపాటు ప్రభాస్ బర్త్​ డే సందర్భంగా పలు సినిమాల నుంచి మరిన్ని అప్డేట్లు రానున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొత్త ప్రాజెక్ట్​ల అనౌన్స్​మెంట్ కూడా ఉండనుందట.

ప్రభాస్ బర్త్​ డే - ఆ రోజు ఫ్యాన్స్​కు 6 సర్​ప్రైజ్​లు!

PVCUలో ప్రభాస్ సినిమా - ప్రశాంత్ వర్మతో మూవీకి డార్లింగ్ ఓకే!

ABOUT THE AUTHOR

...view details