తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

లారెన్స్ ట్రిపుల్​ ధమాకా - వెరీ ఇంట్రెస్టింగ్​గా లైనప్​! - Raghava Lawrence Upcoming Movies - RAGHAVA LAWRENCE UPCOMING MOVIES

Raghava Lawrence Upcoming Movies : రాఘవ లారెన్స్ ఒకే సారి మూడు ఆసక్తికరమైన సినిమాలకు ఓకే చెప్పారు. వాటికి సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. పూర్తి వివరాలు స్టోరీలో

lawrence
lawrence

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 10:23 AM IST

Raghava Lawrence Upcoming Movies :డ్యాన్స్ కొరియోగ్రాఫర్​, డైరెక్టర్​ కమ్ హీరో రాఘవ లారెన్స్ తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. నృత్య ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాక్టర్​గా, డైరెక్టర్​గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి ఈయన. అయితే కొంత కాలం నుంచి ద‌ర్శ‌క‌త్వానికి కాస్త దూరంగా ఉంటూ న‌టుడిగానే సినిమాలు చేస్తూ వస్తున్నారు.

అలా గ‌త ఏడాది లారెన్స్ నుంచి వ‌చ్చిన జిగ‌ర్తాండ డ‌బుల్ ఎక్స్ సూపర్ హిట్​గా నిలిచింది. న‌టుడిగా ఆయన కెరీర్​లోనే బెస్ట్​ మూవీగా నిలిచింది. ఈ సినిమాతో న‌టుడిగా ఆయన మరో మెట్లు ఎక్కారనే చెప్పాలి. దీని తర్వాత మళ్లీ ఇప్పుడు ఆయన తన కొత్త చిత్రాలను అనౌన్స్ చేశారు. అది కూడా ఒకే సారి రెండు. దీంతో పాటే మరో చిత్రం కూడా చర్చల్లో ఉన్నట్లు తెలిసింది. దాదాపుగా ఇది కూడా కన్ఫామే అని సినీ వర్గాల సమాచారం. వీటిలో రెండు చిత్రాలు హీరోగా మరొకటి తన అభిమాన హీరో చిత్రంలో కీలక పాత్ర అని తెలుస్తోంది.

తాజాగా కోలీవుడ్ న్యూ ఇయర్ సందర్భంగా లారెన్స్ హంట‌ర్ అనే కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. వెంక‌ట్ మోహ‌న్ ద‌ర్శ‌కుడు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లారెన్స్ కెరీర్​లోనే అత్య‌ధిక బ‌డ్జెట్​లోనే తెర‌కెక్క‌నున్న చిత్ర‌మిదని తెలుస్తోంది. ప్రీ లుక్ పోస్ట‌ర్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.

ఇంకా దీంతో పాటు బెంజ్ అనే మ‌రో సినిమాను ప్రకటించారు లారెన్స్. ఇందులోనూ ఆయనే హీరో. ఈ సినిమా లియో ఫేమ్ లోకేశ్​ క‌న‌క‌రాజ్​ అందించిన క‌థ‌తో తెర‌కెక్క‌నుండ‌డం విశేషం. రెమో ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్​ తెరకెక్కిస్తున్నారు. దీని అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ కూడా మస్త్ ఆసక్తికరంగా ఉంది.

ఇక లారెన్స్ ఎప్ప‌టి నుంచో రజనీకాంత్​తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడా ఛాన్స్ వచ్చినట్లు తెలిసింది. లోకేశ్​ క‌న‌క‌రాజ్ - రజనీ కాంత్ కాంబోలో ఓ సినిమా రెడీ అవుతోంది. ఇందులో లారెన్స్ స్పెషల్ రోల్​లో కనిపించనున్నారట. మొత్తంగా లారెన్స్ కొత్త సినిమాల లైన‌ప్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ వారం OTTలోకి 18 సినిమాలు - ఆ మూడు స్పెషల్ ఫోకస్​ - This Week OTT Releases

వచ్చే ఐదు నెలలు స్టార్ హీరోలదే - ఏఏ సినిమాలు వస్తున్నాయంటే? - Star Heroes Upcoming Movies

ABOUT THE AUTHOR

...view details