తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అది చూసి వాంతు వచ్చినట్టైంది' - ఆ స్టార్ హీరో మూవీపై రాధిక కామెంట్స్​! - రాధిక శరత్​ కుమార్ ట్విట్టర్​

Radhika Sarath Kumar Latest Tweet : సీనియర్​ నటి రాధిక శరత్​ కుమార్​ ట్విట్టర్ వేదికగా తాజాగా ఓ మూవీపై తీవ్రమైన కామెంట్లు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Radhika Sarath Kumar Latest Tweet
Radhika Sarath Kumar Latest Tweet

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 3:37 PM IST

Updated : Jan 27, 2024, 5:38 PM IST

Radhika Sarath Kumar Latest Tweet :కోలీవుడ్​ స్టార్ నటి రాధిక శరత్​ కుమార్​ తాజాగాఓ సంచలనాత్మక ట్వీట్​ చేశారు. ఓ సినిమా పై అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్ చేశారు. "ఏదైనా సినిమా చూసి మీరు విసిగిపోయారా? నాకైతే ఓ మూవీని చూస్తున్న సమయంలో వాంతి చేసుకోవాలనిపించింది. మధ్యలోనే ఆపేయాలని అనిపించింది. చాలా కోపంగా ఉంది." అంటూ ఆమె నెట్టింట రాసుకొచ్చారు. అయితే ఈ ట్వీట్​ చూసిన ఫ్యాన్స్ దీనిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పలు రకాలుగా స్పందిస్తున్నారు. రాధిక మాట్లాడుతున్నది తాజాగా ఓటీటీలో విడుదలైన 'యానిమల్‌' మూవీ గురించేనంటూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఆమె ఏ సినిమా గురించి ఇలా మాట్లాడారో తెలియాల్సి ఉంది.

మరోవైపు ప్రముఖ ఓటీటీ నెట్​ఫ్లిక్స్ వేదికగా యానిమల్​ మూవీ ప్రస్తుతం స్ట్రీమింగ్​లో ఉంది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్న నటించిన ఈ సినిమాను సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవెల్​లో ఈ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైంది. బాబీ దేఓల్​, అనిల్ కపూర్​ లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్ర పోషించారు. తొలి రోజు నుంచే సెన్సేషన్​ టాక్ అందుకుని బాక్సాఫీస్​ షేక్​ చేసిన ఈ మూవీ అటు టాక్​ పరంగా ఇటు వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది. అయితే అంతటా భారీ వసూళ్లు అందుకున్నప్పటికీ ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్లో హింసను తీవ్రస్థాయిలో చూపించారంటూ పలువురు నెటిజన్లు విమర్శలు చేశారు.

Animal Movie OTT : కొన్ని సీన్స్​లో స్త్రీని తక్కువ చేసి చూపించారంటూ సినీ విశ్లేషకులు సైతం పలు మార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్​ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాధిక ట్వీట్‌ చేయడం వల్ల ఆమె మాట్లాడుతున్నది ఈ సినిమా గురించేనంటూ పలువురు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాధిక మాత్రం తాను ఏ సినిమా గరించి మాట్లాడుతున్నదనేది మాత్రం చెప్పకపోవడం గమనార్హం.

'అన్‌స్టాపబుల్ 2'లో ట్రిపుల్ ధమాకా.. ఇద్దరు రాజకీయ నాయకులతో రాధిక

పాపం చిరంజీవి.. రాధిక ఎంత పని చేసింది...!

Last Updated : Jan 27, 2024, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details