Pushpa Shooting At Ramoji Film City:ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవెయిటెడ్ సినిమా 'పుష్ప- 2'. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్మాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. దాదాపు 90శాతం సినిమా పూర్తైనట్లు తెలుస్తోంది. తాజాగా క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో హీరో అల్లు అర్జున్ సహా పలువురు నటీనటులు పాల్గొంటున్నారు.
ఆర్ఎఫ్సీ (Ramoji Film City)లో భారీ వ్యయంతో వేసిన సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ పతాక సన్నివేశాల్ని చిత్రబృందం అత్యంత అద్భుతంగా చిత్రీకరించే పనిలో ఉంది. ఈ షెడ్యూల్లో హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు హైలైట్‌గా ఉండనున్నాయని మూవీటీమ్ తెలిపింది. ఇక క్లైమాక్స్ సీన్స్‌కు థియేటర్లలో గూజ్ బంప్స్ రావడం గ్యారెంటీ అంట. డైరెక్టర్ సుకుమార్ బన్నీని ఫుల్ మాస్ క్యారెక్టరైజేషన్లో తెరమీద చూపించనున్నారట. అంతేకాకుండా 'అల్లు అర్జున్ నుంచి మరో బ్లాక్‌బస్టర్ లోడింగ్' అంటూ ఫ్యాన్స్‌కు ఫుల్ హైప్ ఇచ్చారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన వీడియో గ్లింప్స్ పాటలకు భారీ స్పందన లభించింది. ముఖ్యంగా పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. మ్యూజిక్ సంచలనం దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.