తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప' పాటలతో యూట్యూబ్​ షేక్- రిలీజ్​కు ముందే రికార్డులు బ్రేక్! - Pushpa 2 Records - PUSHPA 2 RECORDS

Pushpa 2 Songs: స్టార్ హీరో అల్లు అర్జున్ 'పుష్ప- 2' పాటలతో యూట్యూబ్​ను షేక్ చేస్తున్నారు. ఇప్పటిదాకా రిలీజైన రెండు పాటలు రికార్డు స్థాయి వ్యూస్​తో దూసుకుపోతున్నాయి.

Pushpa 2 Songs
Pushpa 2 Songs (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 10:17 PM IST

Pushpa 2 Songs:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక మంధన్నా లీడ్ రోల్​లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్​పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా రిలీజ్​కు ముందే పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజైన పాటలు యూట్యూబ్​ను షేక్ చేస్తున్నాయి. మిలియన్ల కొద్ది వ్యూస్​తో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పుష్- 2 ఓ అరుదైన రికార్డు సాధించింది.

రీసెంట్​గా రిలీజైన 'పుష్ప పుష్ప', 'సూసేకి' పాటలను తెలుగు సహా హిందీ, కన్నడ, తమళ భాషల్లో విడుదల చేశారు. అయితే ఈ రెండు పాటలకు కూడా తెలుగుతోపాటు హిందీలో భారీ క్రేజ్ దక్కింది. దీంతో ఈ రెండు పాటలు (తెలుగు, హిందీ వెర్షన్​లలో కలిపి నాలుగు సాంగ్స్​) టాప్- 100 ట్రెండింగ్​లో కొనసాగుతున్నాయి. ఇలా ఒకే సినిమాలోని వేర్వేరు పాటలు టాప్- 100​లో ఉండడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, 'సూసేకి' పాట తెలుగు వెర్షన్ ప్రస్తుతం టాప్ 2లో ఉండగా, హిందీ వెర్షన్ 'అంగారన్' టాప్ 8లో కొనసాగుతోంది. ఇక పుష్ప టైటిల్ సాంగ్ 'పుష్ప పుష్ప' తెలుగు వెర్షన్ 79వ స్థానంలో ఉండగా, హిందీ వెర్షన్ 57వ ప్లేస్​లో కొనసాగుతోంది.

Pushpa songs Youtube Views: ఇక వ్యూస్​లోనూ ఈ రెండు పాటలు రికార్డు స్థాయిలో వ్యూస్​తో దూసుకుపోతున్నాయి. 'సూసేకి' పాట తెలుగు వెర్షన్​కు కోట్ల వ్యూస్ రాగా, హిందీలో 2.5+ కోట్ల వ్యూస్​ దక్కాయి. అటు పుష్ప (తెలుగు) 4.4+ కోట్ల వ్యూస్ రాగా, హిందీలో 5.1+ కోట్ల వ్యూత్​తో పలు రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. కాగా, ఈ రెండు పాటలకు సోషల్ మీడియాలో నెటిజన్లు దాదాపు లక్షకుపైగా రీల్స్​ కూడా చేశారు.

ఇక సినిమా విషయానికొస్తే, రాక్​స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్​, సునీల్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను వరల్డ్ వైడ్​గా ఆగస్ట్ 15న గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నారు. కచ్చితంగా ఈ చిత్రం రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అల్లు అర్జున్​ 'పుష్ప 2'కు పోటీగా దిగిన కీర్తిసురేశ్​ - Alluarjun VS Keerthi Suresh

'పుష్ప' కపుల్ సాంగ్ ఔట్- శ్రీవల్లి 2.Oని చూశారా? - PUSHPA COUPLE SONG

ABOUT THE AUTHOR

...view details