Pushpa 2 vs kalki 2898 AD : ఇండియావైడ్‌గా ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి భారీ క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే చాలా మందికి టక్కున గుర్తొచ్చే పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీతో పాటు రామ్ చరణ్, తారక్ కూడా ఆర్ఆర్ఆర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్నారు. అయితే టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఎప్పుడూ రసవత్తరంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలా ఈ సారి బన్నీ - ప్రభాస్ బాక్సాఫీస్ ముందు పోటీపడబోతున్నట్లు తెలుస్తోంది.
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 ఏడీ. భారీ తారాగాణం నటిస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్ చేస్తారని అంతకుముందు అనౌన్స్ చేశారు. అయితే షూటింగ్ ఇంకాస్త బ్యాలెన్స్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు సమయం సరిపోతుందా అనే అనుమానాలు రేకెత్తాయి. కానీ మూవీటీమ్ మాత్రం రిలీజ్ డేట్లో మార్పు లేదంటూ చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడు రూట్ మార్చింది. తాజాగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ దెబ్బకు పోస్ట్ పోన్ తప్పేలా లేదంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడది ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది.
కానీ ఈ ఎఫెక్ట్ అల్లు అర్జున్ పుష్ప 2పై పడేలా కనిపిస్తోంది. ఎందుకంటే పుష్ప 2 ఆగస్ట్ 15న రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఆ డేట్‌కే ఇప్పుడు కల్కి కూడా రాబోతుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అసలే ఇప్పటికే పుష్ప 2కు పోటీగా విజయ్ దళపతి గోట్, హిందీలో సింగం అగైన్ వంటివి వస్తున్నాయి. ఇప్పుడు కల్కి కూడా అంటే పుష్ప కలెక్షన్స్‌పై కచ్చితంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.