తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

OTTలోకి వచ్చేస్తోన్న ఫహాద్ ఫాజిల్ రూ.100 కోట్ల బ్లాక్​ బస్టర్​ సినిమా - డోంట్ మిస్​! - Avesham Movie - AVESHAM MOVIE

Fahadh Faasil Avesham Movie OTT Streaming : పుష్ప విలన్​ ఫహాద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రూ.100 కోట్ల కలెక్షన్​ మూవీ ఓటీటీ రిలీజ్​కు రెడీ అయిపోయింది. తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఇప్పటికే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

.
.

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 2:59 PM IST

Fahadh Faasil Avesham Movie OTT Streaming :మలయాళం ఇండస్ట్రీకి 2024 బాగా కలిసొస్తుందనే చెప్పాలి. ఇప్పటికే ఆ ఇండస్ట్రీ నుంచి విడుదలైన భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్, ది గోట్ లైఫ్, ప్రేమలు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవగా రీసెంట్​గా రిలీజైన ఫహాద్ ఫాజిల్ ఆవేశం కూడా మంచి సక్సెస్ సాధించింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కి ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం 13 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్​ను టచ్ చేసింది. అంటే ఇప్పటికే నాలుగింతల లాభాలను తెచ్చిపెట్టేసింది. ఇంకా థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్ అవుతూనే ఉంది.

దీంతో సినీ ప్రియులంతా మరోసారి తక్కువ బడ్జెట్​తో తెరకెక్కించి జేబులు ఎలా నింపుకోవాలో మలయాళం ఫిల్మ్ మేకర్స్ చూసి నేర్చుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ కామెడీ యాక్షన్ డ్రామాను జీతూ మాధవన్ తెరకెక్కించారు. ఇందులో ఫహాద్ నటనకు సినీ ప్రియులు, అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోతున్నారు.

ఇప్పుడు ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. అలానే ఓటీటీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్​పై సమాచారం అందింది. మే 17 నుంచి అమెజాన్​ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో భాషల్లోనూ అందుబాటులో ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి. కానీ ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే వస్తుందని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు.

ఆవేశం కథ విషయానికి వస్తే గ్యాంగ్‌స్ట‌ర్ స్టోరీకి మ‌ద‌ర్‌ సెంటిమెంట్‌, కామెడీని జోడించి తెరకెక్కించారు. ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్​స్టర్​గా కనిపించారు. బీబీ (మిథున్ జై శంక‌ర్‌), శాంత‌న్ (రోష‌న్ శాన్‌వాజ్‌), అజు(హిప్‌స్ట‌ర్‌) అనే ముగ్గురు కుర్రాళ్లు ఇంజ‌నీరింగ్ చ‌ద‌వ‌డానికి కేర‌ళ నుంచి బెంగ‌ళూరు వ‌స్తారు. అక్కడ ఈ ముగ్గురిని ర్యాగింగ్ పేరుతో సీనియ‌ర్లు బాగా వేధిస్తారు. మరి లోకల్ గ్యాంగ్​స్టర్​ అయిన ఫహాద్ ఫాజిల్ సాయంతో ఆ ముగ్గురు తమను ర్యాగింగ్ చేసిన వాళ్లను ఎలా ఎదుర్కొన్నారు? వారి చదువులు ఏమయ్యాయి అనేదే ఈ మూవీ కథ.

కాగా, ఫహాద్ ఫాజిల్ మలయాళంతో పాటు తెలుగు వారికి కూడా సుపరిచితుడే. పుష్ప సినిమాలో నెగటివ్​ పోలీస్​ ఆఫీసర్​గా ఆకట్టుకున్నారు. త్వరలోనే పుష్ప 2లోనూ కనిపించనున్నారు. అంతకుముందు నాయకుడు, విక్రమ్ వంటి చిత్రాలతోనూ మెప్పించారు.

'మలయాళ సినిమాలు బ్లాక్​ బస్టర్లు అవ్వడానికి కారణమిదే' - Fahadh faasil

OTTలోకి మరో మలయాళీ బ్లాక్ బస్టర్​ క్రైమ్​ థ్రిల్లర్​ - స్ట్రీమింగ్ ఎక్కడంటే? - Nayattu OTT

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details