Ranbir Kapoor Mahira Khan : షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'రయీస్' చిత్రంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది పాకిస్థాన్ నటి మహిరా ఖాన్. మొదటి చిత్రంతోనే భారత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, కెరీర్‌ను కొనసాగించలేకపోయింది. అయితే అందుకు కారణం ఆమె హీరో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి దిగిన ఫొటోలే కారణమని చెబుతోంది! తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అప్పట్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది ఆ హీరోయిన్.
"మా ఫొటోలు బయటకు వచ్చిన టైమ్‌లో 'ది లిటిల్ వైట్ డ్రెస్' పేరుతో ఓ ఆర్టికల్ వచ్చింది. దాని వల్ల ఏం జరుగుతుంది అనేది అప్పుడు ఆలోచించలేకపోయాను. ‘పాకిస్థాన్‌లో ఏ నటీ సాధించని విజయాన్ని భారత్‌లో ఆమె సాధించింది. కానీ ఇప్పుడా క్రేజ్ అంతా పోయేలా ఉంది. అసలు ఈమెకు ఏమైంది?" అంటూ రాసుకొచ్చింది. అది చూసి నాకేమైనా పిచ్చి పట్టిందా అని నేను అనుకున్నాను. కానీ ఆ తర్వాతే నా కెరీర్ ముగిసిందనిపించింది. ఎందుకంటే నా లైఫ్‌లో అత్యంత కష్ట సమయం కూడా అదే. ఈ ఘటన వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో ప్రభావం చూపింది. ముఖ్యంగా నా వ్యక్తిగత జీవితంలో, కలలో కూడా ఊహించనవి ఎన్నో జరిగిపోయాయి. దాన్ని తలచుకుంటూనే రోజూ ఏడ్చేదాన్ని. ఓ వైపు డివొర్స్, సింగిల్ పేరెంట్‌గా ఉండడం, అదే సమయంలో ఫొటోలు బయటకు రావడం జరిగిపోయాయి. అప్పుడు నా కష్ట సమయంలో అభిమానులే తోడుగా ఉన్నారు" అని మహిమా రాసుకొచ్చింది.
అసలు ఏ ఫొటోలు బయటకు వచ్చాయంటే? - 2017లో రణ్‌బీర్- మహిరా న్యూయార్క్‌లో కలిగి ఫొటోలు దిగారు. అప్పుడు ఆ పిక్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. ఆ లీకైన ఫొటోల్లో వారిద్దరు సిగరెట్ పట్టుకుని కనిపించారు. అవి అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. దీంతో, వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. తర్వాత మహిరా ఇక్కడైతే మరో సినిమాలో నటించలేదు.
అతడితో పెళ్లి, విడాకులు - మహిరా, తన స్నేహితుడు అలీ అస్కారీని పెళ్లి చేసుకుంది. కానీ వీరిద్దరు 2015లో విడిపోయారు. వీరికి ఓ బాబు. తర్వాత, మహిరా, వ్యాపారవేత్త సలీమ్ కరీమ్‌ను గతేడాది పెళ్లి చేసుకుంది.
2024లో ఈ హీరోలు అస్సలు కనిపించలే - 2025 మాత్రం డబుల్ ధమాకాతో!