Pushpa 2 Ticket Prices :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర సృష్టిస్తోంది. డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా రిలీజైన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.621 కోట్లు వసూల్ చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడం వల్ల థియేటర్‌కు వెళ్లాలని ఆడియెన్స్ భావిస్తున్నప్పటికీ టికెట్ ధరలు చూసి కాస్త ఆలోచిస్తున్నారట! ఈ నేపథ్యంలో మూవీటీమ్ ఆడియెన్స్‌కు టికెట్ ప్రైజ్ నుంచి రిలీఫ్ ఇస్తూ, ధరలు తగ్గించింది.
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి పుష్ప టికెట్ ధరలు తగ్గాయి. ప్రస్తుతం బుకింగ్ పోర్టల్స్‌లో టికెట్ ధర సింగిల్ స్క్రీన్ రూ.200, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 395 చూపిస్తోంది. అదనంగా జీఎస్టీ, సర్వీస్ ఛార్జీలతోపాటు ఆయా లొకేషన్, థియేటర్లను బట్టి ధరల్లో మార్పులు ఉన్నాయి. అయితే డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 పెంచుకునేలా ప్రభుత్వాలు ముందుగానే అనుమతించాయి. కానీ, ముందుగా అనుమతి ఇచ్చిన దానికంటే ప్రస్తుతం బుకింగ్ పోర్టల్స్‌లో తక్కువగా చూపించడం గమనార్హం. దీంతో మూవీ లవర్స్ ఫుల్ ఖుషీ అవతున్నారు.
సినిమాకు మంచి బజ్ ఉండడం, టికెట్ ధరలు కూడా కాస్త తగ్గడం వల్ల మరికొన్ని రోజులు థియేటర్లు హౌస్‌ఫుల్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. లాంగ్ రన్లో ఈ సినిమా ఈజీగా రూ.1200 కోట్లకు పైనే వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.