తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నెట్​ఫ్లిక్స్​లో నయా రికార్డు - ఏడు దేశాల్లో టాప్‌ మూవీగా! - గ్లోబల్​గానూ 'పుష్ప 2' తగ్గేదే లే! - PUSHPA 2 NETFLIX RECORD

నెట్​ఫ్లిక్స్​లో 'పుష్ప 2' నయా రికార్డు ఏడు దేశాల్లో టాప్‌ మూవీగా ఘనత

Pushpa 2 Netflix Record
Pushpa 2 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2025, 10:58 AM IST

Pushpa 2 Netflix Record : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ లీడ్​ రోల్​లో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2 : ది రూల్​'. డిసెంబర్ 6న విడుదలై పాన్ఇండియా లెవెల్​లో సూపర్ సక్సెస్​ సాధించిందీ చిత్రం. ఇక ఇన్ని రోజులు థియేటర్లలో సందడి చేసి తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అందుబాటులోకి వచ్చింది. అయితే వచ్చి రాగానే ఈ చిత్రం ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది.

ఓటీటీలోకి స్ట్రీమింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వ్యూస్‌ పరంగా టాప్‌లో ట్రెండ్​గా నిలిచి సందడి చేయగా, తాజాగా ఏడు దేశాల్లో నంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నాన్ ఇంగ్లీష్ సినిమాల విభాగంలో సుమారు 5.8 మిలియన్ల వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. అలా థియేటర్‌లలో రికార్డులు నెలకొల్పిన 'పుష్ప 2 : ది రూల్‌' మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ నయా చరిత్ర సృష్టించింది.

ఎక్స్​టెండట్ వెర్షన్​తో!
ఇక పుష్ప 2 సినిమా విషయానికి వస్తే, కాగా, డిసెంబర్ 5న గ్రాండ్​గా రిలీజైన ఈ సినిమా వరల్డ్​వైడ్​గా రూ.1896​ కోట్లు వసూల్ చేసి ఇండస్ట్రీ హిట్​గా నిలిచింది. ఇందులో అల్లు అర్జున్​కు జంటగా రష్మిక మంధన్నా హీరోయిన్​గా మెరిసింది. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ స్టార్స్​ సునీల్, అనసూయ, జగపతిబాబు, రావు రమేశ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​పై నవీన్, రవి శంకర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

అయితే తొలుత ఈ చిత్రం 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదవ్వగా, తాజాగా మరో 20 నిమిషాలకు ఎక్స్​టెండ్​ చేసి రీలోడెడ్​ వెర్షన్​ను థియేటర్లలో వేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలుగా మారిపోయింది. ఇక ఓటీటీలోనూ కూడా ఇదే నిడివితోనే రిలీజ్ చేశారు.

'పుష్ప 2' మేకింగ్ వీడియో రిలీజ్- ఆ సీన్ల కోసం అప్పటిదాకా ఆగాల్సిందే!

బాహుబలి 2 రికార్డ్ బ్రేక్‌ చేసిన పుష్ప 2- తొలి ఇండియన్ మూవీగా ఘనత!

ABOUT THE AUTHOR

...view details