తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప 2' - రష్మికకు ఆ సెంటిమెంట్​ కలిసొస్తుందా? - PUSHPA 2 RASHMIKA MANDANNA

'పుష్ప 2' రిలీజ్ డేట్​పై హీరోయిన్ రష్మిక ఏం చెబుతోందంటే?

Pushpa 2 Rashmika
Pushpa 2 Rashmika (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2024, 6:58 PM IST

Pushpa 2 Rashmika : మరో మూడు రోజుల్లో 'పుష్ప 2'గాడి రూల్ మొదలు కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 5న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఊహించిన దాని కన్నా భారీ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందని అంతా ఆశిస్తున్నారు. మూవీలో హీరోయిన్​గా రష్మిక నటించింది. అయితే ఈ డిసెంబర్ నెల అంటే తనకు చాలా సెంటిమెంట్ అని చెబుతోంది రష్మిక. ఈ నెలలో విడుదలైన తన చిత్రాలన్నీ సూపర్ హిట్​గా నిలవడం విశేషం.

"నాకు డిసెంబర్‌ నెల అంటే చాలా సెంటిమెంట్‌. ఇంకా చెప్పాలంటే లక్కీ మంత్‌. ఎందుకంటే నా మొదటి చిత్రం కిరాక్‌ పార్టీ ఈ నెలలోనే రిలీజ్ అయింది. ఆ తర్వాత పునీత్‌ రాజ్‌ కుమార్‌తో కలిసి నటించిన అంజనీపుత్ర, చమక్‌ చిత్రాలు డిసెంబర్‌లోనే రిలీజై మంచి విజయాన్ని అందుకున్నాయి. నేషనల్ వైడ్​గా నాకు గుర్తింపు తీసుకొచ్చిన పుష్ప - ది రైజ్‌, యానిమల్‌ చిత్రాలు కూడా డిసెంబర్‌లోనే రిలీజై కలెక్షన్ల సునామీని సృష్టించాయి. ఇప్పుడు ఈ డిసెంబర్‌లోనే పుష్ప - ది రూల్‌ కూడా విడుదల కానుంది." అని రష్మిక పేర్కొంది.

Pushpa 2 Shooting Rashmika : ఆ మధ్య పుష్ప 2 షూటింగ్ పూర్తి కావడంపై కూడా మాట్లాడింది రష్మిక. "డియర్‌ డైరీ, నవంబరు 25 నా లైఫ్​లో ఎన్నో ఎమోషన్స్​తో కూడుకున్న రోజు. ఏం మాట్లాడాలో తెలీడం లేదు. గత ఐదేళ్లు పుష్ప సినిమా సెట్‌లోనే గడిపాను. ఇది నాకొక ఇల్లు. ఇప్పటి వరకు పడిన కష్టం, నీరసించిన క్షణాలు, చివరిరోజు కావడంతో అన్నీ నా కళ్ల ముందు మెదిలాయి. ఇలా అన్నిరకాల భావోద్వేగాలతో నా మనసు నిండింది. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరిని ఇకపై మిస్‌ అవుతాను. ఎంతోకాలం తర్వాత బాధతో బాగా ఏడ్చేశాను." అని రష్మిక చెప్పింది.

26 నిమిషాల్లోనే 'పుష్ప 2' అదిరే ఘనత - రిలీజ్​కు ముందే 9 రికార్డులు

ప్రీ బుకింగ్స్​లో 'పుష్ప 2 ' జోరు - 24 గంటల్లోనే ఆ టాప్ సినిమాల రికార్డులన్నీ బద్దలు

ABOUT THE AUTHOR

...view details