Pushpa 2 OTT Rights:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప- 2'లో చేసే రూలింగ్ కోసం యావత్ సినీ లోకం ఎదురుచూస్తుంది. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేస్తూ ఈ సినిమా రైట్స్ రికార్డు ధరకు అమ్ముడవుతున్నాయి. తొలి పార్ట్ హిట్ కావడం వల్ల సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రిలీజ్‌కు ముందే గ్రాండ్ బిజినెస్ చేసేసుకుంటుంది.
ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ థడానీ, 'పుష్ప ది రూల్' హిందీ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.200 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని టాక్ వినిపిస్తోంది. ఇది బాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డ్ డీల్. అయితే ఒక నాన్ హిందీ సినిమా నార్త్‌లో అంత భారీ దక్కించుకోడం ఇదే తొలిసారి. అంతేకాదు, రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్'ను (RRR) కూడా అధిగమించి ఈ సినిమా డిజిటల్ హక్కులు ఆల్‌టైమ్ హైయ్యెస్ట్ ధరకు అమ్మడైనట్లు తెలుస్తోంది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా సంచలనమే. రిలీజ్‌కు ముందే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకుగాను నెట్‌ఫ్లిక్స్ రూ.250 కోట్లు వరకూ కోట్ చేసినట్లుగా సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే డిజిటల్ హక్కుల్లో కూడా పుష్పనే టాప్. దీంతో పుష్ప పేరుగా తగ్గట్టుగానే రిలీజ్ కావడాని కంటే ముందుగానే అభిమానుల మనస్సులతో పాటు, ఇండియన్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తోంది. గతంలో ఓటీటీ రైట్స్ రికార్డు రూ.170 కోట్లతో 'ఆర్ఆర్ఆర్' పేరిట ఈ రికార్డు ఉంది.