తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప 2'పై సెలబ్రిటీల రివ్యూ - ఏం అన్నారంటే? - PUSHPA 2 ICON STAR ALLUARJUN

'పుష్ప 2'పై సినీ ప్రముఖుల ప్రశంసలు - సోషల్ మీడియాలో ట్వీట్స్ ఇవే.

Pushpa 2 Celebrity Reviews
Pushpa 2 Celebrity Reviews (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2024, 5:21 PM IST

Pushpa 2 Celebrity Reviews : 'పుష్ప 2' చిత్రం విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ అందుకోవడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. బన్నీ పర్ఫామెన్స్ అదిరిపోయిందని రివ్యూలు ఇస్తున్నారు. పుష్ప రాజ్ గాడి రూల్ దెబ్బకు బాక్సాఫీస్ బ్లాస్ట్ అవుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పుష్ప 2పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

"అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబో అద్భుతం. హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌, ఇంటర్వెల్‌ సీన్‌, సీఎం ఫొటో సీన్, ముఖ్యంగా జాతర సీక్వెన్స్, ఇలా ఎన్నో సన్నివేశాలు గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. థియేటర్‌లో ఇలాంటి అనుభవాలు పొందడం చాలా అరుదు అనే చెప్పాలి. ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్‌ అనేది చాలా చిన్న పదం అవుతుంది" - అని హరీశ్‌ శంకర్‌ ట్వీట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్​, బన్నీని, సుకుమార్‌ను ట్యాగ్ చేశారు.

"పుష్ప 2 అదిరిపోయింది. వావ్, సర్. ఈ సినిమా నా హృదయాన్ని టచ్ చేసింది. మీ పర్ఫామెన్స్ ఔట్ స్టాండింగ్. మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. కంగ్రాట్స్ సర్. సుకుమార్ బ్రో. నీ హార్డ్ వర్క్, డెడికేషన్‌కు హ్యాట్సాఫ్. మీ పనితనం నాకు చాలా నచ్చింది. రష్మిక చాలా అద్భుతంగా నటించింది. ఫహాద్ అదరగొట్టేశారు. పుష్ప 2 టీంకు కంగ్రాట్స్" అని అట్లీ ట్వీట్ చేశారు.

"పుష్ప 2 వైల్డ్‌ ఫైర్‌ కాదు. ఇది వరల్డ్ ఫైర్‌" - అని రామ్ గోపాల్‌ వర్మ ట్వీట్ చేశారు.

"పుష్ప 2, ఓ హీరో ఎలా ఉండాలి అనేదే కాదు ఎలా ఉంటాడు అనే దానిని బన్నీ చూపించారు. డైలాగ్స్, మ్యానరిజం, కంటి చూపు, చేతివాటం ఇలా ప్రతీ ఒక్కటీ సూపర్​గా ఉంది. అద్భుతంగా నటించాడు. మళ్లీ ఓ జాతీయ అవార్డు రావడం పక్కా. కంగ్రాట్స్ బన్నీ. ఈ మ్యాజిక్ క్రియేట్ చేసిన మ్యాస్ట్రో సుకుమార్‌కు హ్యాట్సాఫ్" అని పుష్ప 2 టీమ్​ను ప్రశంసించాడు దర్శకుడు క్రిష్.

అభిమానిని కొట్టిన సీనియర్‌ యాక్టర్​ - ఆ తర్వాత క్షమాపణలు! - అసలేం జరిగిందంటే?

జాతర ఎపిసోడ్‌కు ఫుల్ విజిల్స్!- ఫ్యాన్స్​ రియాక్షన్​కు బన్నీ రిప్లై ఇదే!

ABOUT THE AUTHOR

...view details