SSMB 29 Priyanka Chopra : మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న #SSMB29పై వారి అభిమానుల్లోనే కాకుండా సినీ లవర్స్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా అప్డేట్స్ కోసం వారందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీంతో దీనికి సంబంధించి రూమర్ అయినా సరే అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ వార్త మూవీ లవర్స్ దృష్టి ఆకర్షించింది. ఇంతకీ అదేంటంటే?
మహేశ్ సరసన ప్రియాంక?
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 'SSMB 29'లో నటించనున్నట్లు ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. దీనికి తగ్గట్లుగా ఆమె తాజాగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. దీంతో ఆమె మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్ కోసమే హైదరాబాద్‌కు వచ్చారంటూ అభిమానులు అంటున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.
దాదాపు 20ఏళ్ల పాటు బీటౌన్లో రాణించిన ప్రియాంక, హాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. అలా గ్లోబల్ స్టార్ ట్యాగ్ సంపాదించిన ప్రియాంకను సినిమాలో తీసుకుంటే హాలీవుడ్ లెవెల్లోనూ క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారని అంటున్నారు. కానీ, ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.