Sankranthiki Vasthunnam US Collection : పెద్ద పండుగ కానుకగా థియేటర్లలో విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన ఈ కామెడీ ఎంటర్టైనర్ రికార్డు వసూళ్లు సాధిస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ.106కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు.
యూఎస్‌లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
అమెరికాలోనూ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ అదిరిపోయే వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డుకెక్కింది. తాజాగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాను డైరెక్ట్ చేసిన గత నాలుగు చిత్రాలు వరుసగా మిలియన్ డాలర్లతో పాటు, రూ.100 కోట్లు వసూలుచేశాంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' అయిదోది అని హర్షం వ్యక్తం చేశారు.
ఇక బుక్‌మై షోలోనూ ఈ మూవీ టికెట్లు జోరుగా అమ్ముడుపోతున్నాయి. కేవలం మూడు రోజుల్లో ఈ చిత్రం 1.5 మిలియన్ టికెట్లను అమ్మినట్లు బుక్‌మై షో తాజాగా ప్రకటించింది.
ఎక్స్ట్రా షోస్ కూడా!
మరోవైపు సంక్రాంతి సెలవులు కావడం వల్ల థియేటర్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. టికెట్లు దొరక్క థియేటర్ నుంచి తిరిగి వెళ్లిపోతున్న ప్రేక్షకులూ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అదనంగా 220+ షోలను వేయాలని నిర్ణయించినట్లు మేకర్స్ పేర్కొన్నారు. సంక్రాంతి సెలవులకుతోడు వీకెండ్ కూడా కలిసి రావడం వల్ల మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ ఫీమేల్ లీడ్స్‌గా నటించారు. సీనియర్ నటుడు నరేశ్, వీటీ గణేశ్, సాయి కుమార్, మురళీ, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరొలియో చక్కటి సంగీతం అందించంగా, శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
'సంక్రాంతికి వస్తున్నాం'పై మహేశ్ రివ్యూ- డైరెక్టర్‌ను అలా అనేశాడేంటి?
'సంక్రాంతికి వస్తున్నాం' ఓపెనింగ్స్- వెంకీ మామ కెరీర్లోనే ఆల్‌టైమ్ హైయ్యెస్ట్!