Prithviraj Sukumaran Aadu Jeevitham Movie :పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్లో వచ్చిన తాజా చిత్రం 'ది గోట్ లైఫ్' బాక్సాఫీస్ వద్ద ఎంతటి మాసివ్ సక్సెస్ అందుకుంటోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'గోట్ డేస్' అనే నవలను ఆధారంగా చేసుకుని వాస్తవిక ఘటనలను తెరకెక్కించింనుందున ఈ సినిమాపై మూవీ మరింత ఆసక్తి కనబరిచారు. అయితే తాజాగా ఈ సినిమకు సంబంధించిన ఓ వార్త కాంట్రవర్సీకి దారి తీసింది.
'గోట్ డేస్'లో రాసిన విధంగా ఓ కాంట్రవర్సీ సీన్‌ను మూవీ టీమ్ షూట్ చేసిందని, అయితే సెన్సార్ దృష్టిలో పడ్డాక దానికి నో చెప్పడం వల్ల దాన్ని తొలగించారంటూ ఆన్‌లైన్‌లో రూమర్స్ హల్చల్ చేశాయి. అయితే ఈ విషయంపై తాజాగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. తాము అలాంటి సీన్స్ అస్సలు షూట్ చేయలేదని వెల్లడించారు.
"మేం అలాంటి సీన్ అస్సలు చేయలేదు. తన సినిమాలోని హీరో రోల్ అలా ప్రవర్తించకూడదని మా డైరెక్టర్ భావించారు. 2008లో బ్లెస్సీ ఈ కథతో నా వద్దకు వచ్చినప్పుడు, ఆ పాత్రకు ఏవిధంగా న్యాయం చేయాలన్న విషయాన్ని నేను బాగా ఆలోచించాను. నవల ప్రకారం ఆ పాత్రను నేను అర్థం చేసుకోవాలా? లేదా బ్లెస్సీ చెప్పిన విధంగానే దాన్ని ఊహించుకోవాలా? అన్న కన్ఫ్యూజన్ నాలో మొదలైంది. అయితే చివరకు నేనూ - బ్లెస్సీ ఒక నిర్ణయానికి వచ్చి, ప్రేక్షకులకు చేరువయ్యేలా ఈ సినిమాను తీర్చిదిద్దాం"
అంటూ క్లారిటీ ఇచ్చారు.