తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రేమలు బ్యూటీ కూడా బన్నీకి వీర ఫ్యాన్!- నేషనల్ అవార్డ్ విన్నింగ్​ రోజు ఏకంగా ఇంటికే వెళ్లిందట - Premalu Heroine mamitha baiju

Premalu Heroine Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫేవరెట్ హీరో అని ప్రేమలు మూవీ హీరోయిన్ మమిత బైజు చెప్పింది. బన్నీ స్టైల్, డ్రెస్ సెన్స్​ అంటే తనకెంతో ఇష్టమని మమిత ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

Premalu Heroine
Premalu Heroine

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 7:52 AM IST

Updated : Mar 14, 2024, 8:46 AM IST

Premalu Heroine Allu Arjun:మలయాళ సెన్సెషనల్ హిట్ 'ప్రేమలు' ఇటీవల తెలుగులో రిలీజై ఇక్కడ కూడా బ్లాక్​బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. హైదరాబాద్​ బ్యాక్​డ్రాప్​లో గిరీష్ ఏడి తెరకెక్కించిన ఈ సినిమా యూత్​ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక హీరో నస్లెన్, హీరోయిన్ మమిత బైజు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా హీరోయిన్ మమిత యాక్టింగ్​ స్కిల్స్​, లుక్​తో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. దీంతో ఈ మలయాళ భామకు కుర్రకారులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. అయితే తాను మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు పెద్ద అభిమాని అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఆయన నటించిన 'హ్యాపీ', 'ఆర్య', 'ఆర్య-2', 'ఇద్దరమ్మాయిలు', 'రేసు గుర్రం', 'పుష్ప-1' సినిమాలు తన ఫేవరెట్ అని మమిత చెప్పింది. తనతోపాటు ఆమె సోదరుడు కూడా బన్నీ స్టైల్, డ్రెస్ సెన్స్ ఫాలో అవుతారని పేర్కొంది. ఇక బన్నీకి నేషనల్ అవార్డు వచ్చిన సమయంలో తాను హైదరాబాద్​లో ఉన్నానని, ఆ రోజు అల్లు అర్జున్ ఇంటికెళ్లి ఆయన్ను చూసినట్లు మమిత ఇంటర్వూలో తెలిపింది.

వరుస ఆఫర్లు:అయితే ఒక సినిమా హిట్ అవ్వగానే, ఆటోమేటిక్​గా ఆ హీరోయిన్లకు వరుస ఛాన్స్​లు క్యూ కడుతుంటాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్​ మమిత బైజుకు కూడా ఆఫర్లు వరుస కడుతున్నాయట. మమితకు తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ పలువురు డైరెక్టర్లు క్రేజీ ఆఫర్లు ఇస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. మమిత తన తదుపరి చిత్రంలో తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్​తో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రామ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్​తో కలిసి మమిత ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకుంది. వీరిద్దరి కాంబోలో 'రెబల్' తెరకెక్కింది. ఈ మూవీ మార్చి 22న రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత మమితకు ఛాన్స్​లు ఎక్కువవుతాయనడంలో సందేహం లేదు. దీంతో 'రెబల్' తర్వాత ఆమె తదుపరి సినిమాల వివరాలు బయటకు వస్తాయి.

రివ్యూ: మలయాళ 'ప్రేమలు'- తెలుగులో ఎలా ఉందంటే?

'అసూయ, బాధతో చెబుతున్నా' - ఆ కొత్త హీరోయిన్​కు ఫిదా అయిపోయిన జక్కన్న!

Last Updated : Mar 14, 2024, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details