Prathinidhi 2 Teaser:పదేళ్ల క్రితం వచ్చిన 'ప్రతినిధి' సినిమా సమాజంలో ఎన్నో సమస్యలపై ప్రశ్నలను లేవనెత్తింది. టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ జర్నలిస్ట్‌గా ఈ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకులు బాగానే ఆదరించారు. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది 'ప్రతినిధి-2'. శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఈ టీజర్లో పదునైన డైలాగ్స్‌తో నారా రోహిత్ విశ్వ రూపం చూపించారు. ఎన్నికల వేళ ఈ టీజర్లో డైలాగులు రాజకీయాలకు సంబంధించినదిగా ఉండడం అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది.
ఒకటిన్నర నిమిషాల పాటు నిడివి ఉన్న ఈ టీజర్ ఓ బంగ్లాలో బంబ్ పేళుడుతో ప్రారంభమౌతుంది. ఇక ఈ టీజర్లో నారా రోహిత్ డైలాగ్సే హైలైట్. 'రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడుంది?' ఇక చాలా కాలం పాటు బుల్లి, వెండి తెరకు దూరంగా ఉన్న ఉదయభాను కూడా ఈ సినిమా టీజర్ లో కనిపించింది. ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో నారా రోహిత్ ఈ సినిమాలో కనిపించనున్నారు. 'ఒళ్లు వంచి బయటకు వచ్చి ఓటు వేయండి, లేదంటే దేశం విడిచి వెళ్లిపోండి. అదీ కూదరకపోతే చచ్చిపోండి' అంటూ ఈ దేశ పౌరులుగా మన బాధ్యతను గుర్తు చేయడం టీజర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన డైలాగ్.