Prashanth Varma PVCU 3 :టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన PVCU యూనివర్స్ నుంచి మూడో సినిమా అనౌన్స్ చేశారు. 'మహాకాళి' అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు స్టోరీ అందిస్తున్నారు. పూజా కొల్లురు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అలాగే మహాకాళి సినిమాకు స్మారణ్ సాయి సంగీతానికి అందిస్తున్నారు. ఈ మేరకు ప్రశాంత్ అధికారిక ట్విట్టర్ లో ప్రకటించారు. ఈ క్రమంలో గురువారం ఓ పోస్టర్, వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు.
'ఈ నవరాత్రుల శుభ సందర్భంగా, నేను చాలా ప్రత్యేకమైన విషయాన్ని షేర్ చేసుకోవడానికి థ్రిల్‌గా ఉన్నాను. RKDstudiosతో కలిసి అజేయమైన యోధురాలు, నిజాయితీపరుల రక్షణ, చెడు నాశనం చేసే వారి కథను తెరకెక్కించనున్నామని తెలుపడానికి సంతోషిస్తున్నాం' అని రాసుకొట్టారు. ఓ చిన్నారి తన తలను పులికి ఆనించినట్లుగా పోస్టర్‌ను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. పోస్టర్ చూస్తుంటే కోల్‌కతా ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
మహిళా సూపర్ హీరో ఫిల్మ్
PVCU యూనివర్స్ నుంచి రానున్న మూడో సినిమా మహాకాళి. ఈ సినిమా భారతీయ మొదటి మహిళా సూపర్ హీరో ఫిల్మ్ అని తెలుస్తోంది. ఆర్ కేడీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్, అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. అలాగే మహాకాళి మూవీ పాన్ ఇండియన్ లెవల్లో రూపొందనుంది. దీన్ని 3D ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.