Prasanth Varma Mokshagna : సంక్రాంతికి 'హనుమాన్' చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ - రెండు రోజుల క్రితం ఒక సింహం తన పిల్లను చూపుతోన్న ఫొటోను పోస్ట్ చేసి సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించారు. 'సింబా ఈజ్ కమింగ్' అంటూ మూవీ లవర్స్‌లో ఉత్కంఠత రేపారు.
Prasanth Varma Simba Movie :అయితే గత కొద్ది రోజులుగా ప్రశాంత్ వర్మ నందమూరి నట వారసుడు మోక్షజ్ఞను తన సినిమాతో లాంఛ్ చేయబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ చేయబోయే సినిమా మోక్షజ్ఞతోనేనని నందమూరి ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేస్తూ తెగ ఆనందపడిపోతున్నారు. అలానే మోక్షజ్ఞను ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తారో అని తెగ చర్చించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ప్రశాంత్ వర్మ మరో పోస్ట్‌తో నందమూరి ఫ్యాన్స్‌లో ఆనందాన్ని రెట్టింపు చేశారు. "వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం" అంటూ తాజా పోస్ట్‌లో రాసుకొచ్చారు. రేపు(సెప్టెంబర్ 6) ఉదయం 10.36కు ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తానని పేర్కొన్నారు. దీంతో నందమూరి అభిమానులంతా రేపు మోక్షజ్ఞను చూడనున్నామంటూ కామెంట్స్ చేస్తూ తెగ సంతోషపడిపోతున్నారు.