Rajtarun purushothamudu Trailer :టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వరుస సినిమాలు చేస్తున్నా సరైన హిట్ లేక ఆయన ప్రొఫెషనల్ కెరీర్‌కు బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. అయితే ఇదే సమయంలో ఆయన పర్సనల్ లైఫ్‌లోనూ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఆయనపై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది.
అయితే ఈ వివాదం ఓ వైపు నడుస్తుండగానే రాజ్ తరుణ్ నటించిన ఓ కొత్త సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. పురుషోత్తముడు పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ కూడా తాజాగా రిలీజ్ అయింది. 'ఆకతాయి', 'హమ్ తుమ్' ఫేం రామ్ భీమన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాలో రాజ్ తరుణ్ సరసన హాసిని సుధీర్ హీరోయిన్‌గా నటించింది.
అలానే ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, కస్తూరి, బ్రహ్మనందం తదితురులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ డ్రామా కలగలపిన ఈ ప్రచార చిత్రం అద్యంతం ఆకట్టుకునేలా సాగింది. "అహింస పరమో ధర్మః, ధర్మ హింస తదైవచ" అంటూ రాజ్‌తరుణ్ చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా, యాక్షన్ సీన్స్ బానే ఉన్నాయి. రమ్యకృష్ణ లుక్, డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా అనిపించాయి.