తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'స్పిరిట్'​లో ప్రభాస్ సాలిడ్ రోల్​ - స్టోరీలైన్ రివీల్​ చేసిన సందీప్​

Prabhas Spirit Movie : ప్రభాస్ - సందీప్ రెడ్డి కాంబోలో స్పిరిట్​ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ సాలిడ్ అప్​డేట్ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. తాజాగా ఆయన ఓ ఈవెంట్​లో ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Prabhas Spirit Movie
Prabhas Spirit Movie

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 11:29 AM IST

Updated : Feb 29, 2024, 12:26 PM IST

Prabhas Spirit Movie :ఓ వైపు 'సలార్' సక్సెస్​ను ఆస్వాదిస్తూనే మరోవైపు వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉన్నారు రెబల్​ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన మారుతి తెరకెక్కిస్తున్న'రాజాసాబ్'​తో పాటు నాగ్​అశ్విన్​ 'కల్కి 2898 ఏడీ' సినిమా షూటింగుల్లో సందడి చేస్తున్నారు. దీంతో పాటు ప్రశాంత్ నీల్ 'శౌర్యంగ పర్వం' కూడా ప్రభాస్​ లైనప్​లో ఉంది. వీటన్నింటి తర్వాత కూడా ఆయన కాల్షీట్​ ఫుల్ అయ్యిందంటే ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ​

ఇదిలా ఉండగా, ప్రభాస్​ - యానిమల్​ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ఓ సాలిడ్ మూవీ రూపొందనుంది. దీనికి 'స్పిరిట్' అనే టైటిల్​ను కూడా మేకర్స్​ ఎప్పుడో ఫిక్స్​ చేసిన సంగతి తెలిసిందే. టీ సిరీస్​ భూషణ్ కుమార్, సందీప్ వంగ సంయుక్త ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్​డేట్​ను డైరెక్టర్ సందీప్​ రివీల్​ చేశారు. ఓ ఈవెంట్​లో పాల్గొన్న ఆయన స్పిరిట్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. 'స్పిరిట్' సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందంటూ పేర్కొన్నారు.

దీంతో పాటు ఈ సినిమాలో ప్రభాస్ రోల్ గురించి కూడా చెప్పారు. ఇది ఒక సిన్సియర్​ పోలీస్​ ఆఫీసర్ స్టోరీ అని అందులో ప్రభాస్ రోల్​ ఓ రేంజ్​లో ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్​ను ఎప్పుడెప్పుడు ఖాకీ దుస్తుల్లో చూస్తామంటూ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Prabhas Kalki 2898 AD: మరోవైపు ప్రభాస్ నాగ్​ అశ్విన్​ డైరెక్షన్​లో 'కల్కి 2898 AD' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2024 మే 9న వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానున్నట్లు రీసెంట్​గా మేకర్స్ ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ జానర్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్​పై అశ్వనీ దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

6 వేల సంవత్సరాల కథతో 'కల్కి' - టైటిల్ సీక్రెట్ ఇదే : నాగ్​ అశ్విన్

ప్రభాస్ జాన్ జిగ్రీ దోస్త్ ఆ మెగా హీరో అని మీకు తెలుసా? - సీక్రెట్ రివీల్​!

Last Updated : Feb 29, 2024, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details