Prabhas Raja Saab Update: 'సలార్' సక్సెస్ ప్రభాస్ కెరీర్‌కు మళ్లీ ఊపునిచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కల్కి 2898 AD' సినిమా కూడా 2024 మే 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇక ప్రస్తుతం ప్రభాస్- మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ రాజాసాబ్ గురించి కీలక విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
రాజా సాబ్ సినిమా ప్రేక్షకులకు ఓ విజువల్స్ ట్రీట్‌గా ఉండబోతుందని విశ్వ ప్రసాద్ అన్నారు. మూవీ ఔట్పుట్ అద్భుతంగా రాబట్టేందుకు అత్యుత్తమ టెక్నాలజీ వాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఎడిటింగ్‌లో ఎక్కువగా VFX ఉపయోగించామని వాటిని చూసి ప్రేక్షకులు అబ్బురపడతారని అన్నారు. ఇక ఈ సినిమాతో ఆడియెన్స్‌కు పవర్ఫుల్ కంటెంట్ అదిస్తామని విశ్వ ప్రసాద్ దీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో గాని వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది.
రాజా సాబ్ కు మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం తమన్ అందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ తో పాటు నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు కథ కూడా దర్శకుడు మారుతీనే రాశారు. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని పాత్రలో ప్రభాస్ ని చూడచ్చు అని ఇది ఒక రొమాంటిక్ హారర్ సినిమా అని కూడా మారుతీ సృష్టం చేశారు. మారుతీ, సంగీత దర్శకుడు తమన్ తో ఇదివరకే పనిచేయడంతో ఈ క్రేజీ కాంబినేషన్ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి పెంచుతుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ పళని, ఎడిటర్ గా కోటగిరి వేంకటేశ్వర రావు పని చేస్తున్నారు.