Kalki 2898 AD Day 2 Box Office Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. దీంతో రెండో రోజు కూడా భారీగానే కలెక్షన్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ శుక్రవారం ఆ అంచనాలకు కాస్త తగ్గింది. మొదటి రోజుతో పోలిస్తే దాదాపు 50 శాతం వరకు పడిపోయినట్లు sacnilk రిపోర్ట్ వెల్లడించింది.
వాస్తవానికి కల్కి 2898 ఏడీ చిత్రానికి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.191.5 కోట్లు వచ్చాయని మూవీటీమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో తొలి రోజే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. గురువారం(జూన్ 27) వర్కింగ్ డే అయినప్పటికీ ఈ స్థాయి భారీ వసూళ్లు అందుకోవడానికి కారణం ఆ సినిమాకు ఉన్న హైపే కారణం. దీనికి తోడు తొలి రోజు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో ఈ లెక్కన రెండో రోజు శుక్రవారం కూడా భారీగానే వసూళ్లు వస్తాయని అంతా ఆశించినా రాలేదు.
sacnilk రిపోర్ట్ ప్రకారం కల్కి సినిమాకు మొదటి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.95.3 కోట్ల వరకు ఉన్నాయి. కానీ రెండో రోజు ఇండియాలో రూ.50 కోట్ల వరకు నెట్ వసూళ్లే వచ్చాయి. ఇందులో తెలుగు నుంచి రూ.24.65 కోట్లు, తమిళం(రూ.3.5 కోట్లు), హిందీ(రూ.20.5 కోట్లు), కన్నడ(0.3 కోట్లు), మలయాళం(రూ.2 కోట్లు) వచ్చినట్లు పేర్కొంది. అయితే ఎలాగో వీకెండ్ వచ్చింది కాబట్టి శని, ఆదివారాల్లో మళ్లీ ఈ కలెక్షన్లు రెట్టింపు అవ్వొచ్చని అంతా అంచనా వేస్తున్నారు.