తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఏదో తేడాగా ఉందే' - దీపిక తెలుగు డబ్బింగ్​పై ట్రోల్స్​! - Prabhas Kalki 2898 AD Trailer

Prabhas Kalki 2898 AD trailer Deepika padukone : కల్కి ట్రైలర్​లో దీపికా పదుకొణె తెలుగు డబ్బింగ్​పై ట్రోల్స్​ వస్తున్నాయి. నెటిజన్లు కొన్ని వీడియోలను షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 9:17 AM IST

http://10.10.50.75:6060/reg-lowres/11-June-2024/br-pat-01-railway-station-lift-eksletar_11062024090411_1106f_1718076851_382.jpg
deepika prabhas (http://10.10.50.75:6060/reg-lowres/11-June-2024/br-pat-01-railway-station-lift-eksletar_11062024090411_1106f_1718076851_382.jpg)

Prabhas Kalki 2898 AD trailer Deepika padukone : ప్రస్తుతం కల్కి 2898 ఏడీ ట్రైలర్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. రిచ్​ విజువల్స్, మూవీ కాన్సెప్ట్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా ప్రతీ దాని గురించి అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అమితాబ్ ప్రభాస్ పాత్రలకు కనెక్షన్ ఏంటి?​, బుజ్జి - భైరవల కథ ఏంటి? దీపిక పదుకొణె, దిశా పటానీల పాత్రలు ఏంటి? కమల్ హాసన్ డిఫరెంట్​ లుక్, రోల్​ ఇలా ప్రతీ ఒక్క అంశం గురించి సోషల్ మీడియాలో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. మొత్తంగా ట్రైలర్​కు ఫుల్ మార్క్​లు పడ్డాయి. కానీ ఒక్క విషయంలో మాత్రం ట్రోల్​ అవుతోంది. అదే దీపిక పదుకొణె తెలుగు డబ్బింగ్.

ఈ సినిమాలో యాక్టర్లంతా దాదాపుగా తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్​ను అయితే చాలా మంది డబ్బింగ్ వల్లే గుర్తు పట్టారు. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దిశా పటానీ కూడా ఓన్ డబ్బింగే చెప్పుకున్నారు. అయితే దీపిక తెలుగు బాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా మంది ట్రైలర్​లో దీపిక గొంతు విన్నాక ఏదో తేడాగా ఉందే, డబ్బింగ్ విషయంలో నాగ్ అశ్విన్ ఇలా ఎందుకు చేశారంటూ అందరూ అనుకుంటున్నారు.

దీపికను ట్రోల్ చెయ్యడానికి ప్రభాస్ పాత సినిమాలో ఓ సీన్​ను వాడేస్తున్నారు. 'యోగి' చిత్రంలో తల్లికి ప్రభాస్ లెటర్ రాస్తుంటే నయన్ దొంగతనంగా చూస్తూ దాన్ని ఫన్నీగా చదువుతుంది. ఇప్పుడు దీపిక డబ్బింగ్ కూడా అలానే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అలానే గతంలోనూ దీపిక ఇలానే డబ్బింగ్ చెప్పిందంటూ పాత వీడియోల్ని షేర్ చేస్తున్నారు.

కాగా, కల్కి చిత్రంతోనే దీపికా పదుకొణె టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. అయితే గతంలో కూడా దీపిక ఓ తెలుగు మూవీ చేసింది. కానీ అది రిలీజ్ కాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. అయితే, దీపిక అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్' మూవీలో తెలుగులో కొన్ని డైలాగ్స్ చెబుతోంది. ఆ వీడియోను ట్రోలింగ్​కు వాడేస్తున్నారు.

ఎన్టీఆర్ 'దేవర' షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందంటే?

33,000 అడుగుల ఎత్తులో సల్మాన్ యాక్షన్‌!

ABOUT THE AUTHOR

...view details