IMDB 2024 Most Popular Indian Movies : 2024లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకువచ్చి ఘన విజయాన్ని దక్కించుకున్నాయి. అందులో కొన్ని చిత్రాలు అయితే ఏకంగా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీగా వసూళ్లను కూడా అందుకున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది ముగియనుండటం వల్ల ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాను తాజాగా రిలీజ్ చేసింది.
ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 25 మధ్య రిలీజైన సినిమాల్లో ఐఎండీబీ రేటింగ్ ఆధారంగా ఈ జాబితాను విడుదల చేసింది. వరల్డ్ వైడ్‌గా ఉన్న 250 మిలియన్లకు పైగా సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణలను ఆధారంగా ఈ లిస్ట్‌ను రెడీ చేసినట్లు సదరు సంస్థ తెలిపింది.
ఈ జాబితాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Prabhas Kalki 2898 AD) అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఈ లిస్ట్‌లో ఉన్న టాప్ 10 సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రభాస్ కల్కి 2898 ఏడీ
2. శ్రద్ధా కపూర్ స్త్రీ 2
3. విజయ్ సేతుపతి మహరాజ్
4. అజయ్ దేవగణ్ షైతాన్
5. హృతిక్ రోషన్ ఫైటర్