తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ మూడు ప్రపంచాల మధ్య యుద్ధమే 'కల్కి' - సినిమా కథ చెప్పేసిన నాగ్ అశ్విన్​ - Kalki 2898 AD Story

Prabhas Kalki 2898 AD Story : డైరెక్టర్ నాగ్​ అశ్విన్ కల్కి సినిమా కథ గురించి పూర్తిగా చెప్పేశారు. ఆ వివరాలు స్టోరీలో

source ETV Bharat
Prabhas Kalki 2898 AD Story (Prabhas Kalki 2898 AD Story)

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 9:02 AM IST

Prabhas Kalki 2898 AD Story :రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కీ 2898 ADకు సంబంధించిన కథేంటో చెప్పేశారు నాగ్ అశ్విన్. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ నటులతో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ స్టోరీపై ఓ క్లారిటీ ఇచ్చారు. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లీడ్ రోల్స్‌లో కనిపిస్తున్న సినిమా రిలీజైన తర్వాత సందిగ్ధం ఉండకుండా పూర్తిగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా స్టోరీని బయటపెట్టారు. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం మొదటి పార్ట్‌ను జూన్ 27న రిలీజ్ చేయనున్నారు.

వనరులన్నీ నాశనమైపోయిన ప్రదేశం కాశీ (వారణాసి), శరణార్థులు ఉండే ప్రదేశం శంబాలా, అన్ని అందుబాటులో ఉండే స్వర్గం వంటి ప్రదేశం కాంప్లెక్స్. ఈ మూడింటి చుట్టూ తిరిగే కథే ఇది. ఈ మూడింటికి కల్కితో ఇంటర్ లింక్ ఉంటుంది. అదేంటో సినిమా చూసే తెలుసుకోవాలన్నమాట.

"పవిత్ర గంగానది ఒడ్డున ఏర్పడిన నగరం కాశీ ఈ ప్రపంచంలోనే మొదటి నగరమని అనేక పుస్తకాల్లో, శాసనాల్లో ఉంది. నాగరికత పుట్టుకే ఇక్కడి మొదలైంది విశ్వసిస్తుంటారు. అలాంటిది ప్రపంచంలో చివరి నగరమే కాశీ అయి ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ కల్కీ 2898 AD. అటువంటి దుర్భర పరిస్థితుల్లో కాశీవాసులు అవసరమైన వనరుల కోసం నిత్యం పోరాటం చేస్తుంటారు. అదే సమయంలో తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఉండే ప్రదేశం కాంప్లెక్స్ ఆకాశంలో కిలోమీటర్ మేర వ్యాపించి ఉంటుంది. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. నీరు, ఆహారం, పచ్చదనం అన్ని ఉండి అదొక స్వర్గంలా అనిపిస్తుంది"

"అందుకే కాశీ ప్రజలు కాంప్లెక్స్ ప్రదేశానికి వెళ్లి అక్కడి వనరులను ఆస్వాదించాలనుకుంటారు. అలా వద్దామనుకున్న వాళ్లని కాంప్లెక్స్‌లోని కొందరు వ్యక్తులు అడ్డుకుంటూ ఉంటారు. మిలియన్ల కొద్దీ యూనిట్స్ ఉన్న వాళ్లు మాత్రమే కాంప్లెక్స్ లోకి అడుగుపెట్టగలరు. ఇదిలా ఉంటే, ఇవి రెండూ కాకుండా మూడో ప్రపంచం కూడా ఉంది. అదే శంభాలా. వివిధ సంస్కృతుల్లో ఈ పేరు వినిపిస్తుంది. టిబెటిన్ కల్చర్ లో దీన్ని షాంగ్రిలా అని పిలుస్తారు. ప్రతి సంస్కృతిలో దాగి ఉన్న రహస్య ప్రపంచంలాంటిదే ఈ ప్రాంతం. కాంప్లెక్స్ సభ్యులు వేటకు బలికాకుండా తప్పించుకున్న వాళ్లు ఇక్కడ తలదాచుకుంటారు. ఇలా ఈ మూడు ప్రపంచాల మధ్య నడిచే కథ. ఆ పాత్రల మధ్య జరిగే సంఘర్షణలే కల్కీ 2898 AD కథ" అని నాగ్ అశ్విన్ వివరించారు.

స్టేజ్​పై దీపికతో అలా చేసినందుకు ప్రభాస్​ను ఆటపట్టించిన అమితాబ్!​ - ఈ టీజింగ్ వీడియో చూశారా? - Kalki 2898 AD Pre Release Event

అమితాబ్ నన్ను అలా చేయొద్దన్నారు : ప్రభాస్​ - Kalki 2898 AD Pre Release Event

'దాని కోసం చాలా కాలం ఎదురుచూశా' - అమితాబ్​పై కమల్​ ఇంట్రెస్టింగ్​​ కామెంట్స్ - Kalki 2898 AD Pre Release Event

ABOUT THE AUTHOR

...view details