తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్‌ ఇన్‌స్టా స్టోరీ సీక్రెట్ తెలిసిపోయిందోచ్​ - ఇంతకీ ఆ స్పెషల్‌ పర్సన్‌ ఎవరంటే? - PRABHAS Marriage - PRABHAS MARRIAGE

PRABHAS INSTAGRAM STORY SECRET : ప్రభాస్‌ పోస్ట్ చేసిన ఇన్‌స్టా స్టోరీ వైరల్​గా మారిన సంగతి తెలిసిందే. రెబల్‌ స్టార్‌ జీవితంలోకి రాబోతున్న స్పెషల్‌ పర్సన్‌ ఎవరనే ప్రశ్న అందరి మెదడులలో తిరిగింది. అయితే ఇప్పుడా ఇన్​స్టా స్టోరీ సీక్రెట్, స్పెషల్ పర్సన్​ ఎవరో తెలిసిపోయింది.

Source ETV Bharat
Prabhas (Source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 7:51 PM IST

PRABHAS INSTAGRAM STORY SECRET : ఈ రోజు(మే 17) ఉదయం హీరో ప్రభాస్ షేర్‌ చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ సోషల్ మీడియాను షేక్ చేసేసింది. ఇన్‌స్టా స్టోరీలో ప్రభాస్‌ "డార్లింగ్స్!! ఫైనల్లీ, చాలా ప్రత్యేకమైన వ్యక్తి మన జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. వెయిట్‌ చెయ్యండి" అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్‌లో చెప్పిన ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు? ప్రభాస్‌ పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ ఫ్యాన్స్‌ తమ పోస్టులతో సోషల్‌ మీడియాను హోరెత్తించారు. ప్రభాస్‌ స్టోరీ స్క్రీన్‌ షాట్స్‌ను తెగ షేర్‌ చేసేశారు. కానీ చివరికి తేలిందేంటంటే? ప్రభాస్‌ చేసిన పోస్ట్‌కు, ఆయన పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు. ఇంతకీ ఆ స్టోరీ ఎవరి కోసమంటే?

  • ప్రభాస్‌ లేటెస్ట్‌ స్టోరీ
    ప్రభాస్ శుక్రవారం ఉదయం పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ తన నెక్ట్స్ మూవీ కల్కి 2898 ఏడీ సినిమాకి సంబంధించింది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్‌ స్టోరీ పెట్టినట్లు తేలింది. కల్కి ప్రమోషన్స్‌ కోసం మూవీ మేకర్స్ ప్రత్యేకంగా ఓ కారు డిజైన్‌ చేశారట. రెబల్‌ స్టార్‌ చెప్పినట్లు తన లైఫ్‌లోకి అడుగుపెడుతున్న స్పెషల్‌ పర్సన్‌ ఈ కారే. దీనికి సంబంధించి శుక్రవారం(మే 17) సాయంత్రం కూడా ప్రభాస్‌ మరో స్టోరీ షేర్‌ చేశారు. అందులో కల్కి పోస్టర్‌పై "స్క్రాచ్‌ ఎపిసోడ్‌ 04, మే 18, 5.00 PM అని రాసి ఉంది. క్యాప్షన్‌లో డార్లింగ్స్‌ కాంట్‌ వెయిట్‌ ఫర్‌ యు టు మీట్‌ #మై బుజ్జి!!" అని రాసుకొచ్చారు.

  • నెక్ట్స్‌ లెవల్‌లో కల్కి ప్రమోషన్స్‌
    కల్కి 2898 ఏడీ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన వైజయంతీ మూవీస టీమ్ ప్రమోషన్‌లను భారీ స్థాయిలో చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోన్న కల్కి 2898 AD పాన్ వరల్డ్​గా రూపొందిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్​ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కాగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కల్కి జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details