Prabhas Fauji Movie Shooting Update : సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్, అదే ఊపులో మరిన్ని చిత్రాలను లైన్లో పెట్టారు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' మూవీ చేస్తున్న ఆయన రీసెంట్‌గానే హను రాఘవపూడితో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'ఫాజీ' పేరుతో ఇది తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమై మొదటి షెడ్యూల్‌ను కూడా ప్రారంభించుకుంది.
Prabhas Fauji Second Schedule :తాజాగా ఇప్పుడీ ఫౌజీ సినిమా రెండో షెడ్యూల్‌కు సిద్ధం అవుతోందని తెలిసింది. ఇందుకోసం ఓ భారీ సెట్ నిర్మాణం జరుగుతుందని సమాచారం. అయితే మొదటి షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనలేదు. ఇప్పుడు రెండో షెడ్యూల్లోనూ డార్లింగ్ పాల్గొనే అవకాశం లేదని అంటున్నారు. అలానే హను రాఘవపూడి కూడా ప్రభాస్ లేని సన్నివేశాల చిత్రీకరణకు చకచకా చేస్తున్నారట. సమయం వృథా అవ్వకుండా ఉండేందుకు దర్శకుడు హను పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని తెలిసింది.
కాగా, చివరిగా సీతారామం వంటి భిన్నమైన కథాంశంతో భారీ హిట్‌ను అందుకున్న హను రాఘవపూడి ఈ సారి వార్ నేపథ్యంలో ఒక మంచి ప్రేమ కథతో ఫౌజీని తెరకెక్కిస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా ఇది రానుంది. దీంతో ఈ చిత్రం ఎలా ఉంటుంది? అని ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.