New Beneficiary Names in Ration Card : పేద వర్గాలకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యమైన ధ్రువపత్రం. రేషన్ సరుకులు పొందడం మొదలు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత సాధించడం వరకూ ఈ కార్డు ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అందుకే.. అర్హత ఉన్న ప్రతివారూ రేషన్ కార్డు పొందడం కోసం ప్రయత్నిస్తారు.
అయితే.. కొత్తగా పెళ్లైన వాళ్లు తమ కార్డులో కొత్త పేర్లు యాడ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మెట్టినింటికి వచ్చిన వధువుతోపాటు పుట్టిన పిల్లల పేర్లను కూడా రేషన్ కార్డులో చేర్చాల్సి ఉంటుంది. కానీ.. ఇది ఎలా చేయాలి అనేది చాలా మందికి తెలియదు. అందుకే.. మీకోసం ఈ స్టోరీ. మరి.. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
అవసరమైన పత్రాలు..
మీ రేషన్ కార్డులో కొత్త సభ్యులను యాడ్ చేయడానికి కొన్ని ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. ముందుగా ఆధార్ కార్డ్ ఉండాలి. చిన్న పిల్లల పేర్లను యాడ్ చేయాలంటే.. వారి జనన ధ్రువీకరణ పత్రం కావాల్సి ఉంటుంది. వివాహం ద్వారా మీ కుటుంబంలోకి వస్తే.. దాన్ని నిర్ధారించేందుకు వివాహ ధ్రువీకరణ పత్రం అవసరం అవుతుంది.
దరఖాస్తు ఇలా చేయాలి..
రేషన్ కార్డులో కొత్తవారి పేర్లను యాడ్ చేయడానికి ప్రస్తుతం ఆన్లైన్లో అవకాశం లేదు. అందువల్ల ఆఫ్‌లైన్‌లోనే పని పూర్తి చేసువోకాల్సి ఉంటుంది. దీనికోసం FSC కరెక్షన్ ఫారమ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీసేవా కేంద్రాల్లో లభిస్తుంది. లేదంటే.. ఆన్లైన్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫారమ్ ఇలా నింపండి..
మీ రేషన్ కార్డు నంబర్‌ను మొదటి కాలమ్‌లో ఎంటర్ చేయండి.
ఆ తర్వాత మెంబర్ ఆడిషన్ బాక్సులో రైట్ మార్క్ క్లిక్ చేయండి.
అనంతరం కొత్తగా చేర్చాలనుకుంటున్న వారి అడ్రస్ రాయండి.
ఆ వ్యక్తి పేరు, ఆధార్ నంబర్ వంటి వివరాలను యాడ్ చేయండి.
ఇలా ఫారమ్ పూర్తిచేసిన తర్వాత.. అవసరమైన ధ్రువపత్రాలను దానికి అటాచ్ చేయండి.
ఆ తర్వాత మీ సేవ కేంద్రంలో అందచేయండి.
అప్లికేషన్ ఫారమ్ ఇచ్చిన తర్వాత.. వారి నుంచి రసీదు తీసుకోండి.
మీ పని పూర్తికావడానికి కొన్ని రోజులు పడుతుంది. కాబట్టి.. దరఖాస్తు చేసినట్టుగా ఆ రసీదు ఆధారంగా ఉంటుంది.
ఆన్లైన్ ద్వారా స్టేటస్..
దరఖాస్తు చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ ఎంత వరకు వచ్చిందనే విషయాన్ని.. ఆన్లైన్ ద్వారా ట్రాక్ చేయొచ్చు.
తెలంగాణ అధికారిక https://epds.telangana.gov.in/FoodSecurityAct/ పోర్టల్‌ని సందర్శించండి.
హోమ్ పేజీలో ఎడమ వైపున ఉన్న ఫస్ట్ ఆప్షన్ 'FSC Search' పైన క్లిక్ చేయండి.
ఇప్పుడు Ration Cards Search అనే ఆప్షన్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేస్తే.. ఇప్పుడు మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో FSC Application Search ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ జిల్లా, మీ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి, సెర్చ్ మీద క్లిక్ చేస్తే స్టేటస్ కనిపిస్తుంది.
ఇప్పటికే ఉన్న మీ రేషన్ కార్డు వివరాలను చూసుకోవాలంటే.. FSC Search మీద క్లిక్ చేసి, లోనికి వెళ్లిన తర్వాత రేషన్ కార్డు కాలమ్‌లో మీ కార్డుు నంబర్ ఎంటర్ చేసి, సెర్చ్ చేస్తే సరిపోతుంది. మీ కార్డులోని సభ్యుల పేర్లు అక్కడ కనిపిస్తాయి.