ETV Bharat / state

తిరుమలలో భక్తుల సొత్తు స్వాహా! - దొరికిన వస్తువులను అప్పనంగా పంచేసుకున్నారు! - TIRUMALA FRAUDS

వైఎస్సార్​సీపీ హయాంలో కమాండ్​ కంట్రోల్​ అధికారి చేతివాటం - అందినకాడికి పంచుకుంటూ పోయిన వీఐ - రిపోర్టులో వెల్లడైన పలు విషయాలు

Tirumala Command Control Officer Negligent Behaviour
Tirumala Command Control Officer Negligent Behaviour (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2025, 11:51 AM IST

Tirumala Command Control Officer Negligent Behaviour : దొంగల నుంచి పట్టుకున్న సొత్తుతో పాటు భక్తులు మరిచిపోయిన వస్తువులు తిరిగి అప్పగించాల్సిన అధికారులే వాటిని వాడుకుంటే ఏమనాలి? సొత్తు ఎవరైనా కాజేస్తే నేరమనే చెప్పాలి. గత వైఎస్సార్​సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాగే ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తిరుమలలో దొరికిన వస్తువులను రికార్డుల్లో నమోదు చేయకుండా ఆయన స్వాహా చేసినట్లు విజిలెన్స్​ విచారణలో వెలుగు చూసింది. అయినా ఆయన దొంగతనాన్ని కప్పిపుచ్చి సొంత శాఖకు పంపారు.

తిరుమలలో కమాండ్​ కంట్రోల్​ విభాగం అత్యంత కీలకమైనది. శ్రీవారి భక్తులు అనేక మంది తమ వస్తువులు, ఆభరణాలు, నగదును పలు ప్రాంతాల్లో మరిచిపోతుంటారు. ఇందులో కొన్నింటిని కాజేస్తుండగా, సీసీ కెమెరాల్లో అధికారులు గుర్తించి కమాండ్​ కంట్రోల్​ కేంద్రానికి చేర్చి రికార్డుల్లో భద్రపరుస్తుంటారు. భక్తులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి, ఆ వస్తువులను వారికి తిరిగి ఇస్తుంటారు.

విచారణ నివేదికలో ఏముంది? : వైఎస్సార్​సీపీ హయాంలో 2023లో కమాండ్​ కంట్రోల్​లో విజిలెన్స్ ఇన్​స్పెక్టర్​(వీఐ)గా శివశంకర్​ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అప్పట్లోనే విజిలెన్స్​ భద్రతాధికారి పద్మనాభన్​ నివేదిక కూడా ఇచ్చారు. వీఐ శివశంకర్​ రికార్డులు సరిగా నిర్వహించలేదని, భక్తులు పోగొట్టుకున్న సెల్​ఫోన్లు, బ్లూ టూత్​లను ఆయన సూచనల మేరకు సిబ్బంది వాడుకున్నారని పేర్కొన్నారు.

పలు సందర్భాల్లో దొరికిన బంగారు, వెండి ఆభరణాలను శ్రీవారి హుండీలో డిపాజిట్​ చేసి సీసీ టీవీలో రికార్డు చేయించే వారని, మరికొన్నింటిని హుండీలో డిపాజిట్​ చేసినట్లు చూపించి సీసీ టీవీలో రికార్డు చేయలేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తున్న సిబ్బందిపై చర్యలను మర్చిపోయి, పైగా వారిని ప్రోత్సహించి తన హోదాను వీఐ శివశంకర్​ దుర్వినియోగం చేశారన్నారు. దొరికిన సొమ్మును కార్యాలయ అవసరాలకు వాడారని విజిలెన్స్​ భద్రతాధికారి పద్మనాభన్​ నివేదికలో స్పష్టం చేశారు.

సిబ్బంది విచారిస్తే తెలిసిన విషయాలు :

  • విచారణ అధికారులకు సిబ్బంది పలు విస్తుగొలిపే అంశాలను చెప్పారు. నిందితులు, దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న నగదును వీఐ శివశంకర్​ ఆదేశాలతో కార్యాలయంలో ఆహారం, టీ ఇతర అవసరాల కోసం వాడుకున్నామని సెక్టార్​ 4లో పని చేస్తున్న శంకరయ్య వెల్లడించారు. అలాగే లడ్డూ ప్రసాదాలు, టికెట్ల కోసమూ ఈ డబ్బులను వాడుకున్నారని తెలిపారు.
  • దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్​ పరికరాలను రిజిస్టర్​లో నమోదు చేయకుండా కొందరు సిబ్బంది వాడుకున్నారని పలు సెక్టార్లలో పని చేస్తున్న నాగరాజు తెలిపారు.
  • బంగారం, వెండి ఆభరణాలను హుండీలో వేసేవాళ్లని తెలిపారు. తనకు దొరికిన ఒక ఐఫోన్​ను వీఐ శివశంకర్​కు అప్పగిస్తే, దాన్ని ఆయన పక్కనే ఉండే రమేశ్ ​బాబుకు ఇచ్చారని 13 ఏళ్లుగా పలు సెక్టార్లలో పని చేసిన నాగరాజు చెప్పారు.
  • భక్తులు కోల్పోయిన వాటి వివరాలను అసలు రిజిస్టర్​లో నమోదు చేసే వారు కాదని, సీసీటీవీ ఆపరేటర్​గా సీ-షిఫ్ట్​లో పని చేసిన రమేశ్ ​బాబు వెల్లడించారు.

అక్రమాలకు పాల్పడిన అధికారిపై నామమాత్రంగానే చర్యలు : అక్రమాలకు పాల్పడిన అధికారిపై నాటి టీటీడీ ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం కూడా నామమాత్రంగానే చర్యలు తీసుకుందని తెలుస్తోంది. వాస్తవానికి ఆయనపై కేసు నమోదు చేసి విచారించాలి. ఆరోపణలు అన్నీ రుజువు కావడంతో సస్పెండ్​ చేయాల్సి ఉండగా, మాతృశాఖ రాష్ట్ర పోలీసు విభాగానికి తిప్పి పంపారు. భక్తుల సొమ్ము తిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి అండగా నిలుస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని విన్నపాలు ఉన్నాయి.

శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీ చోరీ స్కామ్​లో నిజాలు వెలుగు చూసేనా?

తిరుమల హుండీలో విదేశీ కరెన్సీ స్వాహా! - పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.