Chinmoy Krishna Das Bail : ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్‌కు బంగ్లాదేశ్ కోర్టులో నిరాశ ఎదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. చిన్మయ్ కృష్ణదాస్ తరఫున సుప్రీంకోర్టుకు చెందిన 11మంది న్యాయవాదులు హాజరైనప్పటికీ, ఆయనకు బెయిల్ లభించలేదు.
బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో 30 నిమిషాల పాటు ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. చిన్మయ్ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలోపెట్టుకొని గురువారం న్యాయస్థానం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి ఆయనకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది. మరోవైపు త్వరలోనే బెయిల్ కోసం హై కోర్టులో అప్పీల్‌కు వెళ్తామని చిన్మయ్ కృష్ణదాస్ తరుఫున న్యాయవాది అపూర్బ కుమార్ భట్టాచారీ తెలిపారు.
'ఇది దురదృష్టకరం'
ఈ బెయిల్ నిరాకరణపై ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ స్పందించారు. 'చిన్మయ్ కృష్ణదాస్‌కు బెయిల్ వస్తుందని అందరం ఆశించాం. గత 42 రోజుల నుంచి ఆయన జైల్లో ఉన్నారు. కృష్ణదాస్‌కు ఆరోగ్యం కూడా మంచిగా లేదని విన్నాం. కానీ బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. ఇది చాలా దురదృష్టకరం. బెయిల్ ఎందుకు తిరస్కరించారో చూద్దాం' అని రాధారమణ్ దాస్ అన్నారు.
VIDEO | Here’s what Kolkata ISKCON Vice President Radharaman Das said on Bangladesh court rejecting Hindu priest Chinmoy Krishna Das' bail plea.
— Press Trust of India (@PTI_News) January 2, 2025
“We all were very hopeful that he would get bail today. He is a monk and was in jail for the last 42 days. We also heard that his… pic.twitter.com/etANf7MwA7
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గతేడాది నవంబరులో చిట్టగాంగ్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు అభియోగాలు వచ్చాయి. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు ఓ న్యాయవాది ప్రయత్నించగా, ఆయనపై ఆందోళనకారులు దాడి చేశారు. మరో సీనియర్ న్యాయవాది కేసును టేకప్ చేయగా, ఆయనపైనా కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో చిన్మయ్ కేసును వాదించేందుకు ఎవరూ ముందుకురాలేదు. చివరకు చిన్మయ్ భాగస్వామిగా ఉన్న సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే అనే సంస్థ 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేసింది.
'మరో ఇద్దరు సాధువులు అరెస్ట్ - బంగ్లాదేశ్‌లో టెన్షన్ టెన్షన్!'
బంగ్లాదేశ్‌లో హిందూ నాయకుడు అరెస్ట్ - తీవ్రంగా ఖండించిన భారత్