Interesting Facts About Prabhas : మాస్, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ, పౌరాణికం ఇలా ఎటువంటి జానరైనా కూడా అలవోకగా నటించి ప్రేక్షకులను మెప్పిస్తారు రెబల్‌స్టార్ ప్రభాస్. తన 22 ఏళ్ల సినీ కెరీర్‌లో ఆయన ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుని బాక్సాఫీస్ వద్ద దుసుకెళ్లారు. అయితే చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన క్రేజ్‌తో ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయ్యారు. నేడు (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో మన డార్లింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు మీ కోసం.
- ప్రభాస్ నటించిన మొదటి సినిమా పేరు 'ఈశ్వర్'. 2002లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అయితే ప్రభాస్ నటనకు మాత్రం ఫుల్ మార్క్స్ పడ్డాయి.
- పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి చేసి మూడు చిత్రాల్లో నటించారు. అందులో 'బిల్లా', 'రెబల్'లో ఈ ఇద్దరూ ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో కనిపించగా, 'రాధే శ్వామ్'లో మాత్రం కృష్ణం రాజు అతిథి పాత్రలో కనిపించారు.
- తన సినీ కెరీర్‌లో ప్రభాస్ పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. అందులో నంది ఉత్తమ నటుడు (మిర్చి), సైమా ఉత్తమ నటుడు (బాహుబలి 2) ఉండటం విశేషం.
- 'యాక్షన్ జాక్సన్' సినిమాలో తొలిసారి అతిథి పాత్రలో మెరిశారు ప్రభాస్. ఆ తర్వాత దేనికైనా రెడీ సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు.
- ప్రభాస్‌తో మూడుసార్లు నటించిన హీరోయిన్ల లిస్ట్‌లో త్రిష (వర్షం, బుజ్జిగాడు, పౌర్ణమి), అనుష్క (బిల్లా, మిర్చి, బాహుబలి) ఉన్నారు. అలాగే ఆయన రాజమౌళి (ఛత్రపతి, బాహుబలి) పూరి జగన్నాథ్‌తో (బుజ్జిగాడు, ఏక్ నిరంజన్) రెండుసార్లు వర్క్ చేశారు.
- ప్రభాస్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి: ది కన్‌క్లూజన్ రికార్డుకెక్కింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన తొలి భారతీయ మూవీ కూడా ఇదే కావడం విశేషం
- 'ఆదిపురుష్'లో రాముడిగా ఇతిహాసగాథలో కనిపించిన ప్రభాస్, కల్కి (కర్ణ), కన్నప్ప (నంది!) లాంటి పౌరాణిక రంగంలోనూ మెరిశారు.
- ప్రముఖ మ్యూజియం మేడమ్ టుసాడ్స్‌లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్‌గా ప్రభాస్ గుర్తింపు పొందారు.
- నటుడు కాకుంటే హోటల్ నడపాలని అనుకున్నట్లు ప్రభాస్ ఓ సందర్భంలో చెప్పారు.
- స్టార్‌డమ్ సొంతం చేసుకున్నా కూడా ప్రభాస్ యాడ్స్‌కు దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు.