Prabhas Spirit Budget : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే బాక్సాఫీస్ ముందు వందల కోట్ల కలెక్షన్స్ పక్కా! అందుకే తమ సినిమాలో రెబల్ స్టార్ ఉంటే చాలు బాక్సాఫీస్ వసూళ్లు కురుస్తాయని నిర్మాతలు ఆయన చిత్రాలపై భారీ బడ్జెట్ పెట్టడానికి వెనకాడటం లేదు. అందుకు తగ్గట్టే ప్రభాస్ సినిమాల బడ్జెట్ వందల కోట్లతో తెరకెక్కుతున్నాయి. బాహుబలి నుంచి ఆయన చేసే ప్రతీ సినిమా ఇదే స్థాయిలో పెట్టుబడితో రూపొందుతున్నాయి. అందులో అత్యధికంగా ఆదిపురుష్ ఏకంగా రూ.500 నుంచి రూ.600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు!అనంతరం కల్కి 2898 ఏడీ కోసం కూడా దాదాపు ఇదే స్థాయిలో ఖర్చు పెట్టారు.
అయితే ఇప్పుడు ప్రభాస్ చేయబోయే మరో కొత్త సినిమా కోసం కూడా దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లు తెలిసింది. అదే స్పిరిట్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో హ్యాట్రిక్ సక్సెస్ సాధించిన సందీప్ రెడ్డి దీన్ని తెరకెక్కించనున్నారు. అందుకే ఈ స్పిరిట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. దీన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్‌తో కలిసి సందీప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారట. వచ్చే ఏడాది జనవరిలో మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇకపోతే నెక్ట్స్ ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల్లో ఒకటి రాజా సాబ్. దీన్ని కూడా గ్రాండియర్‌గానే రూపొందిస్తున్నారు. రూ.400 కోట్ల బడ్జెట్ అని బయట టాక్ నడుస్తుంది. సలార్, కల్కి 2898 ఏడీ సీక్వెల్స్ బడ్జెట్ కూడా భారీ మొత్తంలో ఉంటాయని అంటున్నారు.