OTT Top Trending Movies : వీకెండ్ వచ్చేసింది. దీంతో చాలా మంది ఓటీటీ ఆడియెన్స్ సరికొత్త సినిమా సిరీస్‌లు కోసం వెతికేస్తున్నారు. అలాగే సదరు ఓటీటీ సంస్థలు కూడా ఇప్పటికే పలు కొత్త కంటెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో మీ కోసం ఓటీటీలో టాప్ ట్రెండింగ్ మూవీస్ కొన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చాం.
Hanuman OTT : తేజా సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ చిత్రం ప్రస్తుతం జీ5లో బాగా ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. దీంతో ఈ హనుమాన్ టాప్ ట్రెండింగ్ సినిమాల లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. హిందీ వెర్షన్ అయితే జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్ మార్చి 14న రిలీజై థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడీ చిత్రానికి ఓటీటీలోనూ విశేష ఆదరణ దక్కుతోంది. ఇది కూడా జీ5లో అందుటాబులో ఉంది. ఇంకా కన్నడ హీరో దర్శన నటించిన కాటేరా, ఏడు ఆస్కార్స్ గెలిచిన హాలీవుడ్ మూవీ ఓపెన్‌హైమర్(ఇంగ్లీష్, హిందీ) కూడా జీ5 ఓటీటీలో మస్త్ ట్రెండింగ్ అవుతోంది.
ఇంకా నెట్‌ఫ్లిక్స్‌లో అయితే హృతిక్ రోషన్ ఫైటర్(Fighter OTT) టాప్‌లో ఉంది. యాక్షన్ ప్రియులను ఇది బాగా ఆకట్టుకుంటోంది. దీంతో పాటు సారా అలీ ఖాన్, పంకజ్ త్రిపాఠీ నటించిన మర్డర్ ముబారక్(ఒరిజినల్), డామ్‌సెల్(హాలీవుడ్ ఫాంటసీ), తుండు(కామెడీ నేచురల్ ఎంటర్టైనర్), అన్వేషిప్పిన్ కండెతుమ్(క్రైమ్ ఇన్వెస్టిగేషన్) మంచి థ్రిల్ పంచుతున్నాయి.
డిస్నీహాట్ స్టార్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, జయరామ్ నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఓజ్లర్తో(Ozler OTT) పాటు రజత్ కపూర్ నటించిన లూటెరేకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఆహాలో మరో క్రైమ్ థ్రిల్లర్ భూతద్దం భాస్కర్ ఆకట్టుకుంటోంది. ఈటీవీ విన్లో వైవా హర్ష నటించిన సందరం మాస్టర్ మంచిగా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వీకెండ్లో మీరు చూడని సినిమాలు ఇందులో ఉంటే ప్లాన్ చేసుకుని ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి చూసేయండి.
'స్క్విడ్‌గేమ్' లాంటి అడ్వెంచర్స్- నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న టాప్ 10 మూవీస్ ఇవే - Squid Game Type Movies Hollywood
అదేంటో!- టబు రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ హిట్లే! - Heroine Tabu Rejected Films