OTT Releases This Week:శుక్రవారం వచ్చిందంటే థియేటర్లలో విడుదల కాబోయే సినిమాలే కాదు ఓటీటీ (OTT)లో రిలీజయ్యే కాబోయే చిత్రాల మీద కూడా ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. ఓటీటీ రిలీజ్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూసే వాళ్లు ఉన్నారు. ఓటీటీలకు పెరిగిన ఆదరణ వలన చాలా చిత్రాలు డైరెక్ట్ ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. కొన్ని థియేటర్ రిలీజ్ సినిమాలకు కూడా ఓటీటీల్లో విడుదలయ్యాక రెస్పాన్స్ బాగా వస్తుంది. ఈ వారం అంటే ఏప్రిల్ 19న మూడు థ్రిల్లర్ మూవీస్‌తో పాటు ఒక కామెడీ ఎంటర్టైనర్ కూడా మన ముందుకు రాబోతుంది.
ప్రైమ్ వీడియో: అమెజాన్ ప్రైమ్‌లో ఈ వారం కోలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రణం' విడుదల కాబోతుంది. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలలో నటించిన అనుభవం ఉన్న నందితా శ్వేత ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనుంది. తెలుగు డబ్బింగ్ సినిమాగా విడుదల కానున్న ఈ చిత్రంలో నందితతో పాటు వైభవ్ రెడ్డి కూడా నటించాడు. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్‌లో ఈ చిత్రం ఒకటి.
హాట్ స్టార్: ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు హాట్‌స్టార్‌లో విడుదల కానుంది 'సెరైన్'. జయం రవి సరసన అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ నటించిన ఈ సినిమాలో జయం రవి ఒక అంబులెన్స్ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. చేయని తప్పుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి కథ ఈ సెరైన్ చిత్రం.
జియో సినిమా: థియేటర్లో రీలీజ్ అయినప్పుడు కూడా మంచి టాక్ వచ్చిన 'ఆర్టికల్ 370' మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 19 నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాలో యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రలలో నటించారు. జమ్ము కశ్మీర్‌కు స్పెషల్ స్టాటస్ ఇచ్చే 'ఆర్టికల్ 370'రద్దు చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతూ ఉంటుంది.