తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

థియేటర్లలో చిన్న చిత్రాల హవా - మరి ఓటీటీలో ? - ఈవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు

OTT Movies And Web Series This Week : ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు, వెబ్​సిరీస్​లు ఏవంటే ?

OTT Movies And Web Series This Week
OTT Movies And Web Series This Week

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 12:24 PM IST

OTT Movies And Web Series This Week : సినీ లవర్స్​ను అలరించేందుకు రోజుకో సరికొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తునే ఉంటుంది. ఇక వీకెండ్స్​ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ థియేటర్లకు బారులు తీస్తుంటారు. అయితే సిల్వర్ స్క్రీన్​పై సినిమాలు చూసేందుకు వీలుపడని కొందరు ఓటీటీల్లో వాటిని చూసేందుకు ఇష్టపడతుంటారు. అలాంటి వారి కోసం మేకర్స్​ కూడా థియేటర్లలో విడుదలైన సినిమాలను కొంత కాలం తర్వాత ఓటీటీల్లోకి విడుదల చేస్తుంటారు. దీంతో వెబ్​ ప్లాట్​ఫామ్​లకూ మరింత ఆదరణ పెరిగిపోతోంది. అయితే ప్రతి వారంలాగే ఈ వారం కూడా మరిన్ని కొత్త సినిమాలు, సిరీస్​లు అటు థియేటర్లతో పాటు ఇటు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే ?

టాలీవుడ్​ డైరెక్టర్​ వెంకటేశ్‌ మహా - సుహాస్‌ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు'. ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు లక్ష్ చదలవాడ 'ధీర', తానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన 'గేమ్ ఆన్‌', బిగ్ బాస్​ ఫేమ్​ సోహల్ లీడ్​ రోల్​లో వచ్చిన​ 'బూట్‌కట్‌ బాలరాజు' కూడా ఇదే తేదీన థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు వీటితో పాటు ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్​లు ఏవంటే ?

అమెజాన్ ప్రైమ్

  • డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) - ఫిబ్రవరి 2
  • మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లిష్‌ సిరీస్) - ఫిబ్రవరి 2

డిస్నీ+హాట్‌స్టార్‌

  • కోయిర్ (ఇంగ్లిష్‌ సిరీస్) - జనవరి 31
  • మిస్ ఫెర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 2
  • సెల్ఫ్ (ఇంగ్లిష్‌ సినిమా) - ఫిబ్రవరి 2

నెట్‌ఫ్లిక్స్​

  • మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లిష్‌ సిరీస్) - స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లిష్‌ సినిమా) - స్ట్రీమింగ్‌ అవుతోంది
  • జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లిష్‌ చిత్రం) - జనవరి 30
  • నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లిష్‌ సిరీస్) - జనవరి 30
  • జాక్‌ వైట్‌ హాట్‌ -సెటెల్‌ డౌన్‌ (ఇంగ్లిష్‌) జనవరి 30
  • అలెగ్జాండర్ : ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లిష్‌ సిరీస్) - జనవరి 31
  • బేబీ బండిటో (ఇంగ్లిష్‌ సిరీస్) - జనవరి 31
  • ద సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ సిరీస్) - జనవరి 31
  • ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లిష్‌ మూవీ) - ఫిబ్రవరి 1
  • లెట్స్ టాక్ అబౌట్ (మాండరిన్ సిరీస్) - ఫిబ్రవరి 2
  • ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లిష్‌ సినిమా) - ఫిబ్రవరి 2

మనోరమ మ్యాక్స్​
ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) - ఫిబ్రవరి 2

బుక్ మై షో
అసెడియో (స్పానిష్ సినిమా) - జనవరి 30

జియో సినిమా
ఇన్ ద నో (ఇంగ్లిష్‌ సిరీస్) - (స్ట్రీమింగ్ అవుతోంది)

జీ5
ది సిగ్నేచర్‌ (హిందీ) ఫిబ్రవరి 2

లయన్స్‌ గేట్‌ ప్లే
వన్‌ రేంజర్‌ (ఇంగ్లిష్‌/హిందీ) ఫిబ్రవరి 2

OTTలోకి ఈ వారం 21 సినిమా, సిరీస్​లు - ఆ రెండిటిపై స్పెషల్ ఇంట్రెస్ట్​!

OTTలోకి మరో అందమైన ప్రేమ కథ - డోంట్ మిస్​!

ABOUT THE AUTHOR

...view details