OTT Malayalam Best Lovie Story Movies : మలయాళంలో విడుదలైన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్‌లో ఇప్పటి జనరేషన్‌కు బాగా కనెక్ట్ అయిన చిత్రం ప్రేమమ్. నివీన్ పాల్ హీరోగా నటించిన ఈ చిత్రం యూత్‌కు బాగా కనెక్ట్ అయిపోయింది. ఆల్పోన్సో పుత్రేన్ దర్శకత్వం వహించారు. ఓ యువకుడి జీవితంలో మూడు దశల్లో సాగిన ప్రేమకథతో సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
హ్రిదయం : ప్రణవ్ మోహన్‌లాల్, దర్శనరాజేంద్రన్, కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా నటించిన హ్రిదయం చిత్రం లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం మ్యూజికల్ లవ్ స్టోరీగా యూత్ ఆడియెన్స్‌ను బాగా మెప్పించింది. వినీత్ శ్రీనివాసన్ దర్శకుడు. 2022లో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఓ యువకుడి ప్రేమ ప్రయాణాన్ని ఫుల్ ఎమోషనల్‌గా తెరపై ఆవిష్కరించారు. ఇది కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎన్ను నింతే మోయిదీన్ : సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఎన్ను నింతే మోయిదీన్ మలయాళ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ఆడియెన్స్‌ను కట్టిపడేసింది. తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఇరవై రెండేళ్ల పాటు ఎదురుచూసిన ఓ జంట కథతో తెరకెక్కిందీ చిత్రం. దర్శకుడు ఆర్ ఎస్ విమల్ దీనికి దర్శకత్వం వహించారు. పార్వతి హీరోయిన్‌గా నటించింది. ఇది కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే స్ట్రీమింగ్ అవుతోంది. 9ఏళ్ల క్రితమే రిలీజైన ఈ చిత్రం అప్పట్లోనే రూ.50కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.