OTT Family Entertainment Movies :ఏదైనా సినిమా రిలీజ్ అయింది చూడాలంటే కచ్చితంగా థియేటర్‌కు వెళ్లాల్సిన రోజుల నుంచి ఇంట్లోనే కూర్చొని వినోదాన్ని ఎంజాయ్ చేసే వరకూ వచ్చేశాం. ఓటీటీల పుణ్యమా అని ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్ అన్నీ ఒక్క రిమోట్ దూరంలోకి కనబడుతున్నాయి. కేటగిరీ వారీగా కనబడుతున్నా ఓటీటీ ఓపెన్ చేయగానే ఏ సినిమా చూడాలో అర్థం కాదు. పైగా ఫ్యామిలీతో కలిసి కూర్చొన్నప్పుడు ఏ ప్లాట్‌ఫాంలో ఏ సినిమా ఉందో అర్థంకాక అన్నింటిని వెతుక్కుంటూ కూర్చోవాలి. మీకు ఆ శ్రమ లేకుండా ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం.
Ahaలో -చైతన్యరావుకు షరతులు లేవు - చైన్ సిస్టమ్ ద్వారా డబ్బులు స్కామ్ చేసే ముఠాల గురించి వివరిస్తూ తీసిన సినిమా షరతులు వర్తిస్తాయి. నీటిపారుదల శాఖలో పనిచేసే క్లర్క్ ఆ సమస్యను పరిష్కరించి వందల మందికి ఎలా సాయం చేశాడనేదే కథాంశం.మాస్టర్‌గా వైవా హర్ష పదోన్నతిపై ఆశపడి ఓ కొండ ప్రాంతానికి వెళ్తాడు స్వార్థపరుడైన హీరో. కల్మషం లేని వారి మధ్య బంధం అతని స్వభావాన్ని కూడా మార్చేస్తుంది. ఆద్యంతం ఆసక్తికరంగా, సరదా సన్నివేశాలతో నడిచే సినిమా కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది.మ్యారేజి బ్యాండుతో సుహాస్ కుల వివక్ష ఓ అక్కతమ్ముడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, ఆ గ్రామీణ వాతావరణంలో కులహంకారం వ్యక్తుల్ని ఎలా శాసించిందో ఈ చిత్రంలో చూపించారు. హీరోగా సుహాస్ నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు.ప్రియమైన దొంగ ఓ డేటింగ్ యాప్‌కు కాపీ రైటర్ అయిన అమ్మాయి జీవితంలోకి వచ్చిన సురేశ్ ఆమె మనసు ఎలా గెలిచాడు. దొంగ అని తెలిసినా ఆమె ఎందుకు అతనిని ప్రేమించిందనేది కథాంశం. ఈ సినిమాలో ఎమోషన్‌తో పాటు కామెడీని కూడా చక్కగా పండించారు. Amazon Primeలో ఆ ఒక్కటి అడక్కు నరేశ్కాస్త బ్రేక్ తర్వాత మళ్లీ ఓ కామెడీ సినిమాతో ట్రై చేశారు అల్లరి నరేశ్. పెళ్లి కాని యువతీయువకులు మ్యాట్రిమొనీ సైట్లతో పడే కష్టాల గురించి వివరించిన సినిమా ఇది. చారి 111గా వెన్నెల కిశోర్కామెడీ గూఢచారి పాత్రలో వెన్నెల కిశోర్ కనిపించిన సినిమా 'చారి 111'. స్పై యాక్షన్ కామెడీ చిత్రంలో ఓ గూడఛారి ఒక గమ్మత్తైన తప్పు చేసి కేసుని ఎలా పరిష్కరించాడనేది చూడొచ్చు. గీతాంజలితో మళ్లీ వచ్చిన అంజలిసినిమా ట్రయల్స్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులకు అనుకోకుండా వచ్చిన ఓ ఆఫర్ భరించలేనన్ని కష్టాలు తెచ్చిపెడుతుంది. హర్రర్ కామెడీగా రూపొందిన ఈ సినిమా గతంలో వచ్చిన గీతాంజలి సినిమాకు సీక్వెల్. ఇది 'ఆహా'తో పాటు 'అమెజాన్ ప్రైమ్'లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. Disney+ Hotstarలోగురువాయూర్ కోసం పృథ్వీ ఒరిజినల్ మలయాళీ సినిమా అయిన "గురువాయూర్ అంబలనాదయిల్" తెలుగులోని స్ట్రీమింగ్ అవుతోంది. చాలా తక్కువ నిర్మాణ వ్యయంతో తీసిన సినిమా బాక్సాఫీసు వద్ద రూ.90 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.